గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం తెగరాస ప్రభుత్వ హయాంలో నెరవేరుతుందని పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ప్రస్తుతం గ్రామాలన్నీ గంగదేవిపల్లిని తలపిస్తున్నాయన్నారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రధాని మోదీ స్వయంగా అభినందించారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 8001 వైకుంఠధామాలను, 12,301 డంపింగ్ యార్డులు పూర్తి చేసినట్లు ఎర్రబెల్లి దయాకర్‌రావు శాసనసభలో ప్రకటించారు. మిగిలిన వాటిని ఈ ఏడాది ఏప్రిల్ 30నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు శ్మశాన వాటికల కోసం 1554కోట్ల 76 లక్షలు, డంపింగ్ యార్డుల షెడ్ల కోసం 318 కోట్ల 99లక్షలు రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసినట్లు మంత్రి వివరించారు.
శ్మశానవాటికలు 95శాతం పూర్తయ్యాయన్నారు. వైకుంఠధామాలకు నీటి కొరత ఉంటే బోర్లు వేసేందుకు అనుమతులు కూడా ఇచ్చామని తెలిపారు. గ్రామాల్లో పనులు ఎంత వరకు పూర్తయ్యాయనే అంశంపై ఎమ్మెల్యేలు సమీక్ష చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో 23కోట్ల మొక్కలు నాటామని వాటిని కాపాడే ప్రయత్నం చేయాలన్నారు.ర్సరీల నిర్వహణతో పాటు సర్పంచిలు బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. నిధులు కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారని.. రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి ఎర్రబెల్లి సభకు వివరించారు.
ఇదీ చదవండి: 'ఫోన్‌కాల్‌తో వ్యవసాయ యంత్రాలు సమకూరేలా పథకం'