ఏపీలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఆ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ చెప్పారు. కలెక్టర్లు, జేసీలు, జడ్పీ సీఈవోలు సమర్థంగా పనిచేశారని కొనియాడారు. నాలుగో దశ ఎన్నికల్లో 82.85 శాతం పోలింగ్ నమోదైందని.. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 87.09 శాతం.. అత్యల్పంగా నెల్లూరులో 76 శాతం నమోదైందని వెల్లడించారు.
పంచాయతీ ఎన్నికల 4 దశలు కలిపి మెుత్తం 81.78 శాతం పోలింగ్ నమోదయిందన్నారు.. 4 దశల్లో 2,197 పంచాయతీలు, 47,459 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 10,890 పంచాయతీలు, 82,894 వార్డులకు ఎన్నికలు నిర్వహించామన్నారు. ఎన్నికల్లో 2.26 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. 10 పంచాయతీలు, 670 వార్డులకు నామినేషన్లు రాలేదన్నారు. వాటిపై ఎస్ఈసీకి నివేదించి చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి: కరోనా డోస్ ఇవ్వడంలో తెలంగాణ రెండోస్థానం: గవర్నర్