painter junali : అంతర్జాతీయ స్థాయి చిత్రలేఖనంలో రాణిస్తున్న జునాలీ... హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లికి చెందిన సునీల్‌కుమార్, సంధ్యారాణి దంపతుల కుమార్తె. ప్రస్తుతం నాచారంలోని దిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతోంది. జునాలీ మూడో తరగతి చదవుతున్న సమయంలో.. టీవీ చూస్తూ బొమ్మలు వేసేది. జునాలీ ఇష్టాన్ని గుర్తించిన తల్లిదండ్రులు.. ఆర్ట్స్ టీచర్ వద్ద శిక్షణ ఇప్పించారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అద్భుత చిత్రాలను గీస్తూ... అతి చిన్న వయసులోనే బహుమతులు, సన్మానాలు అందుకుంది.
అతి చిన్న వయసులోనే జేఎన్ఎఫ్లో పెయింటింగ్‌లో సర్టిఫికేట్ పూర్తి చేసి నివ్వెరపరిచింది. జేఎన్ఎఫ్లో చిన్న పిల్లలకు సీటు ఇవ్వడం ఆషామాషీ కాదు. జునాలీ నైపుణ్య, సామర్థ్యాలను గుర్తించిన... పెయింటింగ్ విభాగాధిపతి ప్రీతి సంయుక్త సర్టిఫికేట్ కోర్సు చేసేందుకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత అనేక వర్క్‌షాప్స్‌లో పాల్గొని... పురస్కారాలు సొంతం చేసుకుంది. సమాజాన్ని మేలుకోల్పేలా..... అనేకమైన చిత్రాలకు ప్రాణం పోసింది.
పాపను ఇప్పటికే చాలా వర్క్‌షాప్స్‌కు తీసుకెళ్లాం. అక్కడ నేర్చుకొని... ఇంటికి వచ్చి ప్రాక్టీసు చేస్తుంది. హెరిటేజ్, అర్బన్ స్కెచింగ్ మీద మక్కువ ఎక్కువ. పాపకు సపోర్టు ఇవ్వడానికి మేమెప్పుడూ రెడీగానే ఉంటాం.
-సునీల్‌కుమార్, జునాలీ తండ్రి
జునాలీ ప్రతిచిత్రంలోనూ ఒక భావోద్వేగం కనిపిస్తోంది. జంతువులు, నదుల పరిరక్షణపై అనేక చిత్రాలను గీసింది. వ్యన్య ప్రాణులు, జంతు సంరక్షణ, పర్యావరణ సంరక్షణపై గీసిన చిత్రాలకు.... నేషనల్ మ్యూజియమ్, ఎన్విరాన్‌మెంటల్ ఆర్గనైజేషన్స్ నుంచి ప్రశంస పత్రాలు అందుకుంది. ఎన్టీపీసీ నిర్వహించిన విద్యుత్ పొదుపు పెయింటింగ్ పోటీల్లో బహుమతితో పాటు పదివేల నగదును సొంతం చేసుకుంది. వివిధ అంశాలపై ఆమె గీసిన చిత్రాలకు... ఇప్పటి వరకు వందకుపైగా బహుమతులు, సర్టిఫికేట్స్‌ను దక్కించుకుంది.
థర్డ్ క్లాసులో కలర్స్ చూసి నాకు ఇంట్రస్ట్ వచ్చింది. అప్పటి నుంచి పెయింటింగ్ స్టార్ట్ చేశాను. ఇప్పటికే చాలా కాంపిటీషన్స్‌లో పాల్గొని.. బహుమతులు గెలుచుకున్నా. భవిష్యత్‌లో మంచి చిత్రకారిణిగా గుర్తింపు పొందాలని అనుకుంటున్నాను.
-జునాలీ, చిత్రకారిణి
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: బడ్జెట్‌పై సామాన్యుల భారీ ఆశలు- పన్ను రేట్లు తగ్గుతాయా?