కిన్నెర ఆర్ట్ థియేటర్స్ 42వ వార్షికోత్సవ వేడుకలు హైదరాబాద్లో శుక్రవారం నాడు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం- భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో... రవీంద్రభారతిలోని ఘంటసాల వేదికగా ఈ నెల 30 వరకు వేడుకలు కొనసాగనున్నాయి. 'పద్యానికి పట్టాభిషేకం-పద్యనాటకోత్సవాల' పేరిట జరుగుతున్న కార్యక్రమంలో పలువురు కవులు, ప్రముఖులు పాల్గొన్నారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, కవిసామ్రాట్ డాక్టర్ విశ్వనాథ సత్యనారాయణ కావ్యాల నుంచి కావ్యగానంను ఆచార్య అనుమల్ల భూమయ్య వివరించారు.
ఇదీ చూడండి: 'ప్లాస్టిక్ నిషేధానికి ఓకే.. ప్రత్యామ్నాయాల మాటేంటి'