ETV Bharat / state

ఉపసభాపతి ఏకగ్రీవం...

శాసనసభ ఉపసభాపతిగా పద్మారాపు గౌడ్​ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్​, మజ్లిస్​, భాజపా మద్దతుతో ఎన్నిక లాంఛనమైంది. సోమవారం అధికారిక ప్రకటన వెలువడనుంది.

హాజరైన నాయకులు
author img

By

Published : Feb 23, 2019, 11:21 PM IST

ఉపసభాపతి ఏకగ్రీవం...
సికింద్రాబాద్​ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్​ శాసనసభ ఉపసభాతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవం కోసం తెరాస చేసిన ప్రయత్నలు ఫలించాయి. కేటీఆర్ అసెంబ్లీలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిసి మద్దతు కోరడంతో వారు అంగీకరించారు. కాంగ్రెస్​, మజ్లిస్​, భాజపా మద్దతుతో డీప్యూటీ స్పీకర్​గా బాధ్యతలు చేపట్టనున్నారు. సోమవారం అధికారికంగా ప్రకటిస్తారు. సికింద్రాబాద్​కు చెందిన పద్మారావు గౌడ్ 1977లో యువజన కాంగ్రెస్​లో చేరారు. మోండా డివిజన్ నుంచి 1986, 2002లో కార్పొరేటర్​గా గెలిచారు. తెరాస ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. 2004, 2014, 2018లో ఎమ్మెల్యేగా గెలిచారు. గత ప్రభుత్వంలో ఎక్సైజ్, క్రీడల శాఖల మంత్రిగా పనిచేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.