ETV Bharat / state

Koushik Reddy: నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డి

శాసనమండలి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి హుజూరాబాద్‌ నియోజకవర్గ తెరాస నేత పాడి కౌశిక్‌రెడ్డిని కేబినేట్ ఎంపిక చేసింది. ఈ మేరకు గవర్నర్ తమిళిసైకి సిఫార్స్ చేసింది.

author img

By

Published : Aug 2, 2021, 5:19 AM IST

Updated : Aug 21, 2021, 4:00 PM IST

Padi Kaushik Reddy
పాడి కౌశిక్‌రెడ్డి

శాసనమండలి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి హుజూరాబాద్‌ నియోజకవర్గ తెరాస నేత పాడి కౌశిక్‌రెడ్డి (Koushik Reddy)ని మంత్రిమండలి ఎంపిక చేసింది. ఆమోదం కోసం గవర్నర్‌ తమిళిసైకి సిఫార్సు చేసింది. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలానికి చెందిన కౌశిక్‌రెడ్డి... క్రికెట్‌ క్రీడాకారుడు. 2018లో కాంగ్రెస్‌లో చేరి, హుజూరాబాద్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్​ రెడ్డి... సీఎం కేసీఆర్‌ సమక్షంలో తెరాసలో చేరారు. ఆయన హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తెరాస టికెట్‌ ఆశించినప్పటికీ.. ఆ స్థానాన్ని బీసీకి ఇవ్వాలని నిర్ణయించినందున కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. అందుకే నామినేటెడ్‌ కోటాలో ఎంపిక చేసినట్లు తెలిసింది.

హుజూరాబాద్‌ అభ్యర్థి ఎవరు?

హుజూరాబాద్‌కు తెరాస అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ నెలకొంది. తెరాస విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, మాజీమంత్రి ఎల్‌.రమణ, బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీచూడండి:

Kaushik Reddy Audio Viral: హుజూరాబాద్ తెరాస టికెట్ నాదే.. !

కౌశిక్​ రెడ్డి మరో ఆడియో లీక్​... అందులో ఏముందంటే!

Last Updated : Aug 21, 2021, 4:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.