హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు గెలిపించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి పబ్బతి శ్రీకృష్ణ కోరారు. హైదరాబాద్లోని లక్డీకపూల్లో దళిత సంఘాల నాయకులతో కలిసి ఎన్నికల ప్రచార సీడీని ఆయన ఆవిష్కరించారు.
ఉద్యోగ, నిరుద్యోగుల హక్కుల సాధన, విద్యారంగ పరిరక్షణకై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్పూర్తితో ముందుకొస్తున్నానని శ్రీకృష్ణ తెలిపారు. తనను గెలిపిస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఉద్యోగ సంఘాల హక్కుల కోసం అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: వైభవంగా లక్ష్మినరసింహ స్వామి కల్యాణ వేడుక