హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా పబ్బతి శ్రీకృష్ణ పోటీచేయనున్నారు. పార్టీ కార్యకర్తలతో కలిసి హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలతో పని చేసిన రిపబ్లికన్ పార్టీకి ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా పని చేసిన వారున్నారని శ్రీకృష్ణ తెలిపారు. పార్టీకి పూర్వవైభవం రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కుటిల రాజకీయాలను నమ్మకూడదన్న ఆయన పేద కుటుంబం నుంచి వచ్చిన తనకు అవకాశం ఇవ్వాలని కోరారు.
ఇదీ చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు