ETV Bharat / state

కింగ్ కోఠిలో సహజ వాయువు నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి - కింగ్ కోఠి ఆస్పత్రిలో సహజ వాయువు నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి

లిక్విడ్ ఆక్సిజన్​ను అతి తక్కువగా వినియోగిస్తూ... సహజ పద్ధతిలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్​ను కరోనా రోగుల కోసం వాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా డిఫెన్స్ రీసర్చ్ అండ్ డెవలప్​మెంట్ ఆర్గనైజషన్ (డీఆర్​డీఓ‌) శాఖ వారు కింగ్ కోఠి హైదరాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్​ను ఏర్పాటు చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఇది రోగులకు అందుబాటులోకి రానుంది.

Oxygen production from natural gas in King koti hospital
కింగ్ కోఠి ఆస్పత్రిలో సహజ పద్దతిలో ఆక్సిజన్ ఉత్పత్తి
author img

By

Published : Jun 6, 2021, 1:37 PM IST

హైదరాబాద్ కింగ్ కోఠిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మిస్తున్న ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్​లో ప్రధానంగా ఐదు దశలు... అంటే ఎయిర్ కంప్రెజర్, ఎయిర్ డ్రయ్యర్, ఎయిర్ ట్యాంక్, ఆక్సిజన్ జనరేటర్, ఆక్సిజన్ ట్యాంక్ ఉంటాయి. తొలుత వాతావరణం నుంచి సహజంగా వస్తున్న వాయువును ఇందులోని ఎయిర్ కంప్రెజర్ తీసుకుంటుంది. తర్వాత ఆ వాయువును ఎయిర్ డ్రయ్యర్​లోకి పంపుతుంది. అక్కడ నుంచి ఎయిర్ ట్యాంక్​లోకి వెళ్తుంది. దీని నుంచి ఆక్సిజన్ జనరేటర్​కు వెళ్లి ఆక్సిజన్​ను ఉత్పత్తి చేస్తారు. ఇలా నిమిషానికి 960 కిలోల ఆక్సిజన్​ను సాధారణ వాయువు నుంచి ఉత్పత్తి చేస్తారు. లిక్విడ్ ఆక్సిజన్ వాడకాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రస్తుతం కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రిలో 13 వేల కిలోలీటర్ల ఆక్సిజన్ సామర్థ్యం కలిగిన లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ ఉంది. దీనిని నింపేందుకు ప్రతి రోజూ జడ్చర్ల నుంచి ఓ లారీ వస్తుంది. లిక్విడ్ ఆక్సిజన్​ను కోట్లాది రూపాయిలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో ఆక్సిజన్ జనరేటర్లను నిర్మించుకునేందుకు బడ్జెట్ కేటాయించింది. దీంతో డీఆర్​డీఓ శాఖ ఈ ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్స్ తయారీని టాటా కంపెనీకి అప్పజెప్పింది.

ఇక్కడ ఉత్పత్తి కోసం నిర్మించిన ఆక్సిజన్ జనరేటర్​కు ఏదైనా టెక్నికల్ సమస్య వచ్చి ఉత్పత్తి ఆగిపోతే... అప్పటి వరకు ఉత్పత్తి అయిన ఆ ఆక్సిజన్​ను 5, 10, 20, 30, 72 కేజీల సిలిండర్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తారు. గత వారం రోజులుగా ఇక్కడ ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్ పనులు జరుగుతున్నాయని... మరో రెండు రోజుల్లో సహజంగా తయారైన ఆక్సిజన్​ను రోగులకు అందిస్తామని ఆసుపత్రి కొవిడ్ బ్లాక్ నోడల్ అధికారి డాక్టర్ మల్లికార్జున్ తెలిపారు. ఈ ప్లాంట్... సహజ సిద్ధమైన వాయువు నుంచి నిమిషానికి 960 కిలోల ఆక్సిజన్​ను ఉత్పత్తి చేస్తుందని... ఇది ఎంతగానో ఉపయోగకరమన్నారు.

ఆక్సిజన్ జనరేటర్ అవసరం లేకుండా సహజంగా వచ్చే గాలిని కూడా సిలిండర్​లలోకి ఆక్సిజన్​గా మార్చేలా టాటా కంపెనీ వినూత్నమైన రీతిలో ప్రయోగాలు చేపడుతోంది. దీంతో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత తీరనుంది.

ఇదీ చదవండి: 'ఈ నెల 10లోపు ధరణిలో చేరిన రైతులకు నగదు జమ'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.