కరోనా విపత్కర సమయంలో వినియోగదారుల అవసరాన్ని గుర్తించి కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం వైరస్ సోకి శ్వాస ఆడక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులను ఆసరాగా చేసుకుని అధిక ధరలకు ఆక్సిజన్ సిలిండర్లను అమ్ముతూ డబ్బు చేసుకుంటున్న హైదరాబాద్కు చెందిన అహ్మద్, వెంకట సుబ్బారావులను ఉత్తరమండల టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సిలిండర్లను సరఫరా చేసే ఏజెన్సీలతో కుమ్మక్కైన వీరు అధిక ధరలకు ఆక్సిజన్ సిలిండర్లను అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని పకడ్బందీగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 40 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుత కరోనా గడ్డుకాలంలో ఆక్సిజన్ సిలిండర్ల కొరతను గమనించి సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో వారు అక్రమంగా ఈ చీకటి వ్యాపారానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: బాలిక అభ్యర్థనపై స్పందించిన కలెక్టర్.. స్మార్ట్ఫోన్ కానుక