ETV Bharat / state

'దూద్ దురంతో 4 కోట్ల లీటర్లు దాటిన పాల రవాణా' - Duramtho express Milk supply

రేణిగుంట నుంచి హజ్రత్‌ నిజాముద్దీన్‌ స్టేషన్‌ వరకు ప్రవేశపెట్టిన దూద్‌ దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ద్వారా సరఫరా చేసిన పాల రవాణా 12న నాటికి 4 కోట్ల లీటర్లను దాటిందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

'దూద్ దురంతో 4 కోట్ల లీటర్లు దాటిన పాల రవాణా'

author img

By

Published : Nov 13, 2020, 8:28 PM IST

లాక్‌డౌన్‌ సమయంలో దేశ రాజధాని న్యూదిల్లీలో పాల సరఫరాను సమన్వయం చేసేందుకు రేణిగుంట నుంచి హజ్రత్‌ నిజాముద్దీన్‌ స్టేషన్‌ వరకు ప్రవేశపెట్టిన దూద్‌ దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ద్వారా సరఫరా చేసిన పాల రవాణా 12న నాటికి 4 కోట్ల లీటర్లను దాటిందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. లాక్‌డౌన్‌కు మునుపు రేణిగుంట నుంచి న్యూదిల్లీకి పాలను నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం నడిచే మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ట్యాంకర్లను అమర్చి రవాణా చేసేవారు.

వినూత్న ఆలోచన...

కొవిడ్‌-19 మహమ్మారి కారణంగా అన్ని మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు కావడం వల్ల దేశ రాజధానికి పాల రవాణా దాదాపు నిలిచిపోయింది. దీని ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే దేశ రాజధానికి పాలను రవాణా చేయడం కోసం ప్రత్యేకంగా దూద్‌ దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడపాలన్న వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. ఈ రైళ్లు మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు సమానంగా రేణిగుంట నుంచి హజ్రత్‌ నిజాముద్దీన్‌ స్టేషన్‌కు మధ్య గల (2,300 కిమీ) దూరాన్ని కేవలం 34 గంటల్లో చేరుకుంటాయి.

విశేష ఆదరణ...

ఈ ప్రత్యేక రైళ్ల ద్వారా రవాణా చేయబడే పాలను చిత్తూరు జిల్లా దాని చుట్టుప్రక్కల్లో గల దాదాపు 13,000 గ్రామా నుంచి నేషనల్‌ డైరీ డెవప్‌మెంట్‌ బోర్డు (ఎన్‌డీడీబీ) యూనిట్‌ 3 వేల కేంద్రాల ద్వారా సేకరించబడతాయి. మార్చి 26న ప్రవేశపెట్టబడిన సమయంలో ఈ సరఫరా రోజు విడిచి రోజు ఉండేది. ఈ ప్రత్యేక రైళ్లకు లభించిన విశేష ఆదరణను దృష్టిలో ఉంచుకుని జులై 15 నుంచి రోజువారీ ప్రాతిపదికన సరఫరా చేయాలని నిర్ణయించారు.

ఒక్కో ట్యాంకర్ లో 40వేల లీటర్లు...

సాధారణంగా 6 పాల ట్యాంకర్లతో కూడిన ఈ రైలు ఒక్కో ట్యాంకరులో 40,000 లీటర్ల పాలను మొత్తంగా 2.40 లక్షల లీటర్ల పాలను రవాణా చేస్తుంది. ఇప్పటివరకు దూద్‌ దురంతో ప్రత్యేక రైళ్లు 167 ట్రిప్పులతో 1,020 పాల ట్యాంకర్ల ద్వారా 4 కోట్ల లీటర్ల పాలను రవాణా చేశారు. ఇది గతంలో నమోదైన 3 కోట్ల లీటర్ల పాల రవాణా మార్కు దాటి కేవలం 45 రోజుల కాల వ్యవధిలో 4 కోట్ల లీటర్ల రవాణా చేసిందని రైల్వే శాఖ వివరించింది.

ఇదీ చూడండి: కాళోజీ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్​ నివాళి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.