ETV Bharat / state

బసవతారకం ఆసుపత్రికి అత్యుత్తమ అవార్డు - అవార్డు రావడం పట్ల బాలకృష్ణ హర్షం

ఊపిరితిత్తుల క్యాన్సర్​తో బాధపడుతున్న ఓ రోగికి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి తరపున ఉచితంగా చికిత్స అందించి కాపాడినట్లు ఆస్పత్రి ఛైర్మన్ బాలకృష్ణ ప్రకటించారు. ఇటీవల ఆస్పత్రికి తెలంగాణ హెల్త్ కేర్ లీడర్ షిప్ అవార్డు, టాప్ గాలెంట్ మీడియా అవార్డులు రావటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. వీక్ మ్యాగజైన్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్​లకు ఇచ్చే ర్యాంకింగ్స్ లో బసవతారకం ఆస్పత్రి ఈ ఏడాది ఆరో స్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు.

Outstanding Award to Basavatarakam Hospital hyderabad
బసవతారకం ఆసుపత్రికి అత్యుత్తమ అవార్డు
author img

By

Published : Dec 5, 2020, 6:25 PM IST

బసవతారకం ఆసుపత్రికి అత్యుత్తమ అవార్డు

ఒక వ్యవస్థను నెలకొల్పడం కన్నా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం చాలా గొప్ప విషయమని నందమూరి బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. బసవతారకం ఆసుపత్రికి దేశంలోనే 6వ ఉత్తమ క్యాన్సర్‌ ఆసుపత్రిగా అవార్డు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

భవిష్యత్‌లో దేశంలోనే అత్యుత్తమంగా బసవతారకం ఆసుపత్రిని తీర్చిదిద్దుతామన్నారు. కరోనా సమయంలోనూ బసవతారకం ఆసుపత్రిలో ఎంతోమంది పేదలకు ఉచిత వైద్యం అందించామని తెలిపారు. సేవా సంకల్పంతో నడుస్తున్న తమ ఆసుపత్రికి అవార్డులు రావడాన్ని... వెన్నుతట్టి ప్రోత్సహించడంగా భావిస్తామని బాలకృష్ణ పేర్కొన్నారు.

తమ వైద్యుల కృషి, సేవానిరతే ఆస్పత్రిని ముందుకు నడుపుతోందన్నారు. ఇక ఏపీ ఆరోగ్య శ్రీకార్డులు ఉన్నవారికి సైతం బసవతారకంలో చికిత్స అందిస్తున్నట్టు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : తహసీల్దార్​ కార్యాలయంలో యువతి ఆత్మహత్యాయత్నం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.