ETV Bharat / state

పచ్చందనమే పచ్చదనమే.. 'ఔటర్​ రింగ్​రోడ్డు'లో వెళితే మది పరవశమే..! - తెలంగాణ వార్తలు

ఆస్వాదించే మనసు ఉంటే.. ప్రకృతిలో ఎన్నో అందాలు కనిపిస్తాయి. ప్రకృతి ప్రేమికులైతే ఆహ్లాదకర వాతావరణంతో అల్లుకు పోతుంటారు. ఇలాంటి వాతావరణం హైదరాబాద్‌ బాహ్యవలయ రహదారిపై ఎక్కడ చూసినా దర్శనం ఇస్తోంది. సూర్య చంద్రులు ఒకేసారి ఆకాశంలో కన్పించే అద్భుత దృశ్యం, పచ్చని మొక్కలు, పూలు, వరుసగా విద్యుత్ దీపాల వెలుగులు ఆకట్టుకుంటున్నాయి.

outer ring road in Hyderabad
outer ring road in Hyderabad
author img

By

Published : Mar 5, 2023, 7:27 AM IST

పచ్చందనమే పచ్చదనమే.. 'ఔటర్​ రింగ్​రోడ్డు'లో వెళితే మది పరవశమే..!

పచ్చదనం ప్రకృతి ప్రేమికులను పరవశింపజేస్తే.. విభిన్న రకాలైన పుష్పాలు మనస్సుని పులకరింపజేస్తాయి. ఆస్వాదించే మనసు ఉంటే, ప్రకృతిలో మనం ఎన్నో అందాలను చూడవచ్చు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా ఉన్న పుష్పాల సోయగాలు.. నగరావాసులను మంత్రముగ్ధుల్ని చేసి ఆకట్టుకుంటున్నాయి. నిత్యం సందడిగా ఉండే నెక్లెస్‌రోడ్‌, ట్యాంక్‌బండ్‌ పరిసరాలు.. ప్రకృతి అందాలతో సందర్శకుల మదిని దోచుకుంటున్నాయి.

ప్రకృతి ప్రేమికులైతే ఆహ్లాదకరమైన వాతావరణంతో అల్లుకుపోతున్నారు. రహదారికి ఇరువైపుల ఉన్న పచ్చదనం, ప్రకృతి అందాలు వీక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రోడ్లకు ఇరువైపులా వేసిన విభిన్న రకాల మొక్కలు, వాటి పువ్వులు.. అటుగా వెళ్లే వారి కళ్లను కట్టిపడేస్తున్నాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో వాటి అందం మరింత రెట్టింపవుతోంది. సెలవులు, పండుగలు వస్తే.. నగరవాసులు వెంటనే నెక్లెస్‌రోడ్‌లో వాలిపోతారు. ఇక్కడ ఉన్న ప్రకృతి అందాలను ఆస్వాదిస్తారు. సాయంత్రం సమయాల్లో అయితే.. ఈ ప్రాంతాలు సందడిగా మారిపోతాయి. ఓ వైపు ప్రకృతి అందాలు, మరోవైపు చిన్నారుల ఆటపాటలతో ఆ ప్రాంతమంత కనులపండువగా మారుతోంది. వారాంతం సమయాల్లో అయితే.. ఇక్కడికి వచ్చేవారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటోంది.

ప్రకృతి అందాలకు వేదిక బాహ్యవలయ రహదారి: ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వివిధ ప్రాంతాల సందర్శనకు వెళ్తుంటాం. అలాంటి ప్రకృతి ప్రేమికులకు నెక్లెస్‌రోడ్‌, సాగర్‌ పరిసర ప్రాంతాలు, రహదారులు ఆ లోటును తీరుస్తున్నాయి. ఆ ప్రకృతి అందాలు.. చక్కటి ఆహ్లాదంతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తున్నాయి. భాగ్యనగర మణిహారం బాహ్య వలయ రహదారి ప్రకృతి అందాలకు వేదికైంది. వాహనాల రణగొణ ధ్వనులకు ఇరువైపులా.. అందమైన పూల మొక్కలు ఆహ్లాదానిస్తున్నాయి. పటాన్‌చెరు శివారు ఎగ్జిట్-3లో ఎక్కి గచ్చిబౌలి వైపు వెళ్తుంటే టెకోమా, అర్జెంటీయా, కబేరియన్ ట్రపెంట్ ట్రీ, బంగారు వర్ణపు చెట్లతో పసుపు రంగుల్లో పూలు ఆకట్టుకుంటున్నాయి.

జిగేల్​ మంటున్న విద్యుత్ దీపాల వెలుగులు: డ్రిప్ ఇరిగేషన్ విధానం సహా ట్యాంకర్​ల ద్వారా నీరు అందిస్తున్నారు. రహదారి పొడువునా ఎటుచూసినా పసుపు పచ్చని బంగారు వర్ణం సంతరించుకుంది. బాహ్య వలయ రహదారిపై వెళ్లే వారికి ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. బొగాన విలియా కాగితపు పూల మొక్కలు అక్కడక్కడ డివైడర్ మధ్య భాగంలో కనిపిస్తున్నాయి. గులాబీ, గోధుమ రంగు పూలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

కనువిందు చేస్తున్న బాహ్య వలయ రహదారి: సాయంసంధ్యా సమయాల్లో విద్యుత్ వెలుగులతో ఓఆర్ఆర్ కొత్తరంగును సంతరించుకుంటోంది. రహదారికి మధ్య నెక్లెస్ మాదిరిగా విద్యుత్ దీపాల వెలుగులు జిగేల్ మంటున్నాయి. ఓఆర్‌ఆర్‌పై వెళ్తున్న వాహనదారులు ఆనందపరవశానికి లోనవుతున్నారు. డివైడర్‌ మధ్య పొగోడా, దురంతా, బొంబే బోర్డర్, నందివర్ధన, మీడియాడార్క్ వంటి మొక్కలు 154 కిలోమీటర్ల మేర ఉన్న బాహ్య వలయ రహదారి పొడవునా కనువిందు చేస్తున్నాయి. ముత్తంగి కూడలి నుంచి కొల్లూరు వరకూ ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.