ETV Bharat / state

'ఔట్​సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక వెయిటేజీ ఇవ్వాలి'

రాష్ట్రవ్యాప్తంగా వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఔట్​సోర్సింగ్ ఉద్యోగులకు టీఎస్​పీఎస్సీ నియామకాల్లో ప్రత్యేక వెయిటేజీ ఇవ్వాలని అసోసియేషన్​ అధ్యక్షుడు దుర్గం శ్రీనివాస్ డిమాండ్​ చేశారు. హైదరాబాద్​లోని బషీర్​బాగ్ ప్రెస్​క్లబ్​లో ఉద్యోగులతో కలిసి సదస్సు నిర్వహించారు.

out sourcing health employees demand to percentage in tspsc notificattions
'ఔట్​సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక వెయిటేజీ ఇవ్వాలి'
author img

By

Published : Nov 21, 2020, 1:36 PM IST

టీఎస్​పీఎస్సీ నియామకాల్లో ప్రత్యేక వెయిటేజీ ఇవ్వాలంటూ తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల సంఘం డిమాండ్​ చేసింది. హైదరాబాద్​లోని బషీర్​బాగ్ ప్రెస్​క్లబ్​లో జరిగిన సదస్సులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నర్సులు, ఏఎన్​ఎంలు పాల్గొన్నారు.

వైద్యారోగ్యశాఖలో ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి, ఔట్​సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వమే నేరుగా జీతాలు ఇవ్వాలని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కనీస వేతనం అమలు చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు కేటాయించాలన్నారు. రెగ్యులర్ నియామకాలు జరిగినప్పుడు ఉద్యోగులను యథావిధిగా కొనసాగించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:బీ-ఫారాలు అందించేందుకు గడువు పొడిగింపు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.