ETV Bharat / state

'క్వారంటైన్ కేంద్రాల్లో సేవలందించేందుకు సిద్ధం' - జిల్లాల్లోని మురికివాడలు

పట్టణాలు, గ్రామాల్లోని మురికివాడలకు కరోనా తీవ్రంగా విస్తరించిందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గం ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విస్తృతంగా పరీక్షలు చేసి కరోనా వ్యాప్తి నివారణ చర్యలు చేపట్టాల్సింది పోయి... అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని మండిపడింది.

క్వారంటైన్ కేంద్రాల్లో హెల్త్ వాలంటీర్ సేవలకు సిద్ధం : సీపీఎం

author img

By

Published : Aug 13, 2020, 7:29 AM IST

రాజధాని నగరానికే కాకుండా జిల్లాల్లోని మురికివాడలనూ కరోనా తీవ్రంగా భయాందోళనకు గురిచేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యవర్గం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ ఎంబీ భవన్​లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.వెంకట్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న అంశాలపై చర్చించిన రాష్ట్ర కార్యవర్గం పలు తీర్మానాలను ఆమోదించింది.

అందువల్ల కరోనా బారిన పడుతున్నారు...

చిన్న గదులు, పూరిగుడిసెలు, అద్దె ఇల్లు, మురికివాడల్లో ఉంటున్న పేదలు సొంత ఇళ్లల్లో క్వారంటైన్​లో ఉండటం సాధ్యం కాకపోవడంతో కుటుంబం అంతా కరోనా బారిన పడుతుతోందని పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. గ్రామాలు, మురికివాడల్లో కరోనా పరీక్షలు నిర్వహించి ఇళ్లల్లో ఐసోలేషన్ సౌకర్యాలు లేని ప్రజలందరికీ ప్రభుత్వమే క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భోజన వసతి సహా ఇతర వసతులన్నీ కల్పించాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రభుత్వాన్ని కోరింది.

కేంద్రంపై ఒత్తిడి తేవాలి...

కేంద్రం... రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని దుయ్యబట్టింది. రాష్ట్రానికి రావాల్సిన అదనపు నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

'అందుకు సంసిద్ధంగా ఉన్నాం'

మండల, పట్టణ కేంద్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే క్వారంటైన్, మెడికల్ కేంద్రాల్లో సీపీఎం కార్యకర్తలు ఆరోగ్య వాలంటీర్స్​గా సేవలందించడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేసింది. సహాయక చర్యల్లో ప్రభుత్వం ఏ బాధ్యతలిచ్చినా నిర్వర్తించడానికి సీపీఎం ప్రజా సంఘాలు సంసిద్ధంగా ఉన్నాయని ప్రకటించింది.

ఇవీ చూడండి : 'సోషల్​ మీడియాలో వదంతులు ప్రచారం చేస్తే వదిలేదిలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.