ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సెక్యూరిటీ ఆఫీస్‌లో పనిచేసే ముగ్గురు సిబ్బందిని విద్యార్థులు చితగ్గొట్టారు. అద్దాలు, ఫర్నీచర్, టెలిఫోన్, ధ్వంసం చేశారు. ఆదివారం ఓయూలో ఎగ్జామినేషన్ బ్రాంచ్ వద్ద ఓ విద్యార్థి మరో మహిళతో నిలబడి ఉంటే తాము అక్కడ ఉండకూడదని హెచ్చరించామని సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. ఇది దృష్టిలో ఉంచుకుని సోమవారం సదరు విద్యార్థి మరో 30 మంది విద్యార్థులను తీసుకునివచ్చి తమపై ఆకారణంగా దాడి చేశారని వివరించారు. సెక్యూరిటీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రాజు నాయక్, జయశంకర్, కిరణ్ అనే సిబ్బందిపై దాడి చేశారని తెలిపారు. దాడికి పాల్పడిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. విధులు బహిష్కరించారు. దాడికి పాల్పడ్డ విద్యార్థులను గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
ఇదీ చూడండి : ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని ప్రజావాణిలో ఆందోళన