Realme GT 7 Pro: గేమింగ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. మార్కెట్లోకి రియల్‌మీ నుంచి అదిరే గేమింగ్ స్మార్ట్‌ఫోన్ వచ్చింది. 'రియల్‌మీ GT 7 ప్రో' పేరుతో దీన్ని తీసుకొచ్చారు. క్వాల్‌కామ్ సంస్థ కొత్తగా లాంచ్ చేసిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ పవర్ఫుల్ ప్రాసెసర్‌ను దీనిలో అమర్చారు. ఈ చిప్ సెట్‌తో వస్తున్న తొలి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ తమదేనని రియల్‌మీ చెబుతోంది. దీనితో పాటు ఈ స్మార్ట్‌ఫోన్ ఏఐ స్కెచ్, సమ్మరీ, స్పీక్, రైటర్, బెస్ట్ ఫేస్ వంటి ఏఐ ఫీచర్లతో కూడా వస్తోంది. అంతేకాక కంపెనీ ఈ మొబైల్‌పై దిమ్మతిరిగే ఆఫర్లను కూడా అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా గేమింగ్ యూజర్లే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ ఫోన్ ధర, ఫీచర్లు, ఆఫర్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
రియల్‌మీ GT 7 ప్రో స్పెసిఫికేషన్స్:
- డిస్ప్లే: 6.78 అంగుళాల క్వాడ్ కర్వ్‌డ్ అమోలెడ్
- ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్
- రిఫ్రెష్‌రేటు: 120Hz
- బ్రైట్నెస్: 6500 నిట్స్
- బ్యాటరీ: 5,800 ఎంఏహెచ్
- 120W ఫాస్ట్ ఛార్జింగ్
- మెయిన్ కెమెరా: 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా: 16 ఎంపీ
- టెలిఫొటో లెన్స్: 50 ఎంపీ
- అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా: 8 ఎంపీ
కలర్ ఆప్షన్స్:
- మార్స్ ఆరెంజ్
- గెలాక్సీ గ్రే
రియల్‌మీ GT 7 ప్రో వేరియంట్స్: ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది.
- 12GB+ 256GB వేరియంట్
- 16GB+ 512GB వేరియంట్
ధర:
- 12GB+ 256GB వేరియంట్ ధర: రూ.59,999
- 16జీబీ+ 512జీబీ వేరియంట్ ధర: రూ.65,999
అందుబాటులోకి ఎప్పుడు?: నవంబర్ 29 నుంచి అమెజాన్, కంపెనీ వెబ్‌సైట్ నుంచి వీటి సేల్స్ ప్రారంభించనున్నట్లు రియల్‌మీ తెలిపింది. ఈ 'GT 7 ప్రో' ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మీ యూఐ 6.0పై రన్ అవుతుంది. దీన్ని కేవలం 30 నిమిషాల్లో 1 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయొచ్చని రియల్‌మీ చెబుతోంది.
ఆఫర్లు ఇవే!: ప్రారంభ ఆఫర్ కింద ఎంపిక చేసిన కార్డులపై ఈ కొత్త ఫోన్‌పై రూ. 3,000 వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. అంతేకాక మూడేళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, నాలుగేళ్ల సెక్యూరిటీ అప్డేట్లను కూడా అందజేస్తామని పేర్కొంది.
స్మార్ట్ అవుట్‌ఫిట్‌తో సరికొత్త మొబైల్- పాడైతే ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు!
యాపిల్ యూజర్లకు అలర్ట్- వెంటనే ఆ పని చేయకుంటే మీ సొమ్ము గోవిందా..!