ETV Bharat / state

వసతి గృహం.. సమస్యల నిలయం - వసతి గృహ సమస్యలు

ఎన్నో లక్ష్యాలతో చదువుకునేందుకు వేలమంది ఉస్మానియా తలుపుతడతారు. కష్టపడి ప్రవేశ పరీక్ష రాసి సీటు సంపాదించుకుంటారు. ఉన్నత ఆశయంతో విశ్వవిద్యాలయ మెట్లెక్కిన అమ్మాయిలకు వసతిగృహంలో సమస్యలు వెంటాడుతున్నాయి. సమస్యలు పరిష్కరించాలంటూ అర్ధరాత్రి ఆందోళనకు దిగారు.

ఉస్మానియా విద్యాలయం
author img

By

Published : Mar 13, 2019, 9:28 AM IST

ఆందోళన చేస్తున్న విద్యార్థినులు
అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయం లేడీస్​ హాస్టల్​లో విద్యార్థినులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. రాత్రివేళల్లో ఆకతాయిల ఆగడాలు ఎక్కువయ్యాయని కళాశాల నుంచి వసతి గృహానికి వెళ్లాలంటేనే భయంగా ఉందని వాపోయారు. సెక్యూరిటీ గార్డులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

భయం భయంగా..

రాత్రి సమయాల్లో విద్యుద్దీపాలు లేకపోవడం వల్ల భయం భయంగా ఉంటోందని విద్యార్థినులు చెబుతున్నారు. వసతి గృహ పరిసరాల్లో తరచూ పాములు సంచరిస్తున్నాయని సరైన భద్రత ఏర్పాట్లు లేవని ఆరోపించారు.

సర్దిచెప్పిన పోలీసులు

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థినులకు నచ్చచెప్పారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.

ఇవీ చూడండి :జూబ్లీహిల్స్​లో హత్య.. ప్రశ్నించడమే కారణం..

( ) రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ మండలి పాలిటెక్నిక్ విద్యలు ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలని ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ డిమాండ్ చేసింది. ఇదే డిమాండ్ తో పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి హైదరాబాద్ సైఫాబాద్లోని బి ఆర్ కె భవన్ ముందు వారు ధర్నా నిర్వహించారు. రోడ్డుపైన బైఠాయించడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. బయోమెట్రిక్ విధానం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా గా 21,481 మంది విద్యార్థుల ను డి టెయీన్ చేసి వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నారని వారు మండిపడ్డారు. క్రమశిక్షణ పేరుతో అటెండెన్స్ రెగ్యులరైజేషన్ పేరుతో ఉనికిలో ఉన్న మాన్యువల్ అటెండెన్స్ పద్ధతిని తొలగించి... అసంబద్ధమైన బయోమెట్రిక్ విధానాన్ని అమలుపరిచి వారిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని డి టెయీన్ అయిన విద్యార్థులందరినీ ప్రమోట్ చేసి... పరీక్షలు నిర్వహించి తరవాత సెమిస్టర్ ను కొనసాగించే విధంగా చెయ్యాలని డిమాండ్ చేశారు.

బైట్: ఏ ఐ డి ఎస్ ఓ రాష్ట్ర కమిటీ సభ్యుడు
బైట్ : వినయ్ పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.