భారత్ బంద్ నేపథ్యంలో రాష్ట్రంలో రేపు జరగాల్సిన పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో రేపు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. ఎల్లుండి నుంచి జరగనున్న పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని.. వాటిలో ఎలాంటి మార్పు లేదని వివరించింది. వాయిదా పడిన పరీక్షల నిర్వహణ తేదీలను తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది.
అదేవిధంగా రేపటి సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు జేఎన్‌టీయూ హైదరాబాద్ వెల్లడించింది. రేపు జరగాల్సిన పరీక్షను ఈనెల 10న నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ పేర్కొంది. రేపటి పాలిటెక్నిక్ డిప్లొమా సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర సాంకేతిక విద్య మండలి.. వాటిని ఈనెల 23న జరపనున్నట్లు తెలిపింది. పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల్లో భాగంగా రేపు జరగాల్సిన పరీక్షను వాయిదా వేసినట్లు కన్వీనర్ కిషన్ తెలిపారు. వాయిదా పడిన పరీక్ష తేదీని తర్వాత ప్రకటించనున్నట్లు సీపీ గేట్ కన్వీనర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రైతుల పాలిట గుదిబండగా వ్యవసాయ చట్టాలు: హరీశ్ రావు