ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత గడ్డం అశోక్‌కు అరుదైన గౌరవం దక్కింది. అర్జెంటీనా దేశానికి చెందిన క్రిస్టియానా ప్రమోటర్స్ డిఫెండర్స్కు పీస్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. తనను పీస్ అంబాసిడర్‌గా నియమించిన వరల్డ్ క్రిస్టియానా అసోసియేషన్‌కు అశోక్ ధన్యవాదాలు తెలిపారు. ఈ గౌరవంతో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఈ సందర్భంగా ఓయూ అధ్యాపకులు వినోద్ కుమార్, పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి జయ వింధ్యాల, ఓయూ విద్యార్థి నేత బాలాజీ, తదితరులు అశోక్‌ను అభినందించారు.
ఇదీ చూడండి : ఆర్థిక ఇబ్బందులు తాళలేక బిడ్డను అమ్ముకున్న తల్లి