తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ ఉస్మానియా యూనివర్సిటీ ఒప్పంద సహాయ ప్రొఫెసర్లు నిరసన ర్యాలీ చేపట్టారు. ఏడో వేతన సంఘం ప్రకారం వేతనాలు పెంచేందుకు ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనంపై 3 శాతం వార్షిక ఇంక్రిమెంటును చెల్లించాలని, వేతన రశీదులు ఇవ్వాలని, పీఎఫ్ వర్తింపచేయాలని కోరారు. రూ. 3,000 పీహెచ్డీ ఇంక్రిమెంటును ప్రతి నెల అమలు చేయాలని, రిటైర్మెంట్ ప్రయోజనాలకు కల్పించాలని కోరారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో నిరసన కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
'కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల డిమాండ్లు పరిష్కరించాలి'
రెగ్యులర్ ఆచార్యులతో పాటే కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు పెంచాలంటూ ఓయూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు నిరసన ర్యాలీ నిర్వహించారు. యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ నుంచి ఓయూ పరిపాలన భవనం వరకు ర్యాలీ చేశారు.