ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొ.డి.రవీందర్ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉస్మానియా యూనివర్సిటీకి ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయ, సహకారాలను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఓయూ వీసీగా నియామకం అయిన డి.రవీందర్‌ను కేటీఆర్ అభినందించారు.
తాను కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థినేనని... ఓయూ పునర్వైభవానికి అన్ని విధాలుగా మద్దతిస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. యూనివర్సిటీకి ప్రభుత్వం పరంగా అందాల్సిన సహాయ, సహకారాలను తప్పకుండా అందిస్తానని మంత్రి కేటీఆర్ అన్నారు. ఓయూ అభివృద్ధికి కావాల్సిన అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఉపకులపతికి మంత్రి హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: 7 వైద్య కళాశాలలు.. 15 నర్సింగ్ కాలేజీలు.. 10వేల పోస్టులు