యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ల నియామకంలో వెనుకబడిన వర్గాలకు సముచిత స్థానం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకే దక్కుతుందని రాష్ట్ర పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా నియమితులైన రవీందర్ యాదవ్.. మంత్రి తలసానిని మర్యాదపూర్వకంగా కలిశారు. వీసీ రవీందర్ యాదవ్‌ను మంత్రి శ్రీనివాస్ యాదవ్ శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
దేశంలో ఎంతో ఉన్నతమైన చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీకి యాదవ సామాజిక వర్గానికి చెందిన రవీందర్ యాదవ్‌ను నియమించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ సర్కార్.. బడుగు, బలహీన వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా సముచితం స్థానం కల్పిస్తూ అభివృద్దికి తోడ్పాటును అందిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేసి ఉస్మానియా యూనివర్సిటీకి మరింత గుర్తింపును తీసుకురావాలని తలసాని... వీసీ రవీందర్ యాదవ్‌ను కోరారు.
- ఇదీ చదవండి ఉస్మానియా ఆసుపత్రిలో మేయర్ తనిఖీలు