ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించి సమ్మె విరమించేలా చేయాలని ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలంటూ ఓయూ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వీరిని బలవంతంగా అరెస్టు చేసి ఓయూ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం అయ్యేవరకు తాము ఉద్యమిస్తూనే ఉంటామని విద్యార్థులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ కార్మికులకే మా సంపూర్ణ మద్దతు: టీపీయూఎస్