ETV Bharat / state

ఆర్గానో క్లోరిన్‌ వల్లే ఏలూరులో అంతుచిక్కని వ్యాధి

క్రిమిసంహారక మందుల్లో ఉండే ఆర్గానో క్లోరిన్‌ వల్లే ఏపీలోని ఏలూరులో అంతుచిక్కని వ్యాధి ప్రబలినట్లు వైద్య వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. బాధితుల రక్తంలో సీసం, నికెల్‌ వంటి లోహాలున్నట్లు దిల్లీ ఎయిమ్స్‌ పరీక్షల్లో తేలినా... వీటికి అదనంగా ఆర్గానో క్లోరిన్ కలిసినందువల్లే మూర్ఛ, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తాయని అనుమానిస్తున్నారు. వింత వ్యాధి నుంచి కోలుకొంటున్న వారి సంఖ్య పెరుగుతున్నా...వారి ఇళ్ల నుంచే కొత్త కేసులు రావడం వైద్యులను కలవరపరుస్తోంది.

ఆర్గానో క్లోరిన్‌ వల్లే ఏలూరులో అంతుచిక్కని వ్యాధి
ఆర్గానో క్లోరిన్‌ వల్లే ఏలూరులో అంతుచిక్కని వ్యాధి
author img

By

Published : Dec 10, 2020, 7:08 AM IST

ఏపీ ఏలూరులో వింత మూర్ఛ వ్యాధికి గల కారణాలు వైద్య నిపుణులకూ అంతుచిక్కడం లేదు. వరుసగా మూడో రోజూ జాతీయ పరిశోధనా సంస్థల నిపుణులు రోగుల రక్త నమూనాలతో పాటు... పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఆహార పదార్థాల నమూనాలను సేకరించారు. ఏలూరుకు సరఫరా అవుతున్న నీటి వ్యవస్థను పరిశీలించి.. నమూనాలను తీసుకున్నారు. డబ్యూహెచ్​వో ప్రతినిధి బృందంతో పాటు ఎన్​సీడీసీ, పుణే వైరాలజీ ల్యాబ్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ తదితర సంస్థలకు చెందిన ప్రతినిధులు క్షేత్రస్థాయిలో నమూనాలు సేకరించారు. ఎన్​సీడీసీ బృందం స్థానికంగా ఉన్న పశువుల్లోనూ సీసం ఆనవాళ్లు ఉండే అవకాశాలపై దృష్టి సారించింది. అస్వస్థతకు గురైన వారి రక్తంలో సీసం, నికెల్ లాంటి భార లోహాలు అధిక స్థాయిలో ఉన్నట్టుగా ఎయిమ్స్ రెండో సారి విడుదల చేసిన నివేదికలోనూ వెల్లడైంది. పూర్తి స్థాయి నివేదికకు మరో రెండ్రోజుల సమయం పట్టే అవకాశముందని తెలుస్తోంది.

పండ్లు, కూరగాయలపై పిచికారీ చేసిన పురుగుమందుల కారణంగా అర్గానిక్ క్లోరైడ్‌ కలుషితమై ప్రజలు అస్వస్థత బారిన పడి ఉండవచ్చని జాతీయ పరిశోధనా సంస్థ నిపుణులు అనుమానిస్తున్నారు. సీసం, నికెల్ లాంటి భార లోహాలు రక్తంలో మిళితమై.. ఈ తరహా అస్వస్థత కలిగేందుకు నెలల సమయం పడుతుందని అభిప్రాయపడుతున్నారు. ఆర్గానో క్లోరిన్ శరీరంలోకి వెళ్తే మూర్ఛ, తలనొప్పి, తల తిరగడం, వాంతులు, వికారం, అవయవాలు కొట్టుకోవడం, వణకడం తికమకగా వ్యవహరించడం చెమటలు పట్టడం వంటి లక్షణాలు బయటపడతాయని చెబుతున్నారు. కొవిడ్ నివారణా చర్యల్లో భాగంగా చల్లిన క్లోరిన్, బ్లీచింగ్‌లు కూడా ఈ తరహా వింత మూర్చ వ్యాధికి కారణమై ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు అనుమానిస్తున్నారు.

వాస్తవానికి ఏలూరులో హఠాత్తుగా ఉత్పన్నమైన మూర్ఛ వ్యాధికి సంబంధించిన కేసులు నవంబరు 22 తర్వాత వచ్చినట్లుగా తెలుస్తోంది. నగరంలోని దక్షిణపు వీధి, పడమర వీధి, జేపీ నగర్ కాలనీ ప్రాంతాల్లో ఒకరిద్దరికి ఈ తరహా మూర్ఛ వచ్చినట్టు సమాచారం. వీరు స్థానిక వైద్యుల దగ్గరకే వెళ్లి చికిత్స చేయించుకున్నారని తెలుస్తోంది. డిసెంబరు 4న ఒకేసారి వందల సంఖ్యలో కేసులు వెలుగుచూడడం వల్ల ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.

అంతు చిక్కని వ్యాధి కారణంగా ఆస్పత్రికి వచ్చే వారి సంఖ్య తగ్గినా.. కొత్త కలవరం మొదలైంది. దీని బారిన పడి కోలుకున్న వారి ఇళ్ల నుంచి కొత్తవారు ఈ వ్యాధి చికిత్స కోసం వస్తున్నారు. వీరిలో పిల్లలతో పాటు... గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే వారూ ఉంటున్నారు. కొందరికి ఆసుపత్రికి వచ్చేసరికే ఫిట్స్‌ తగ్గిపోతున్నాయి. ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత కూడా కొందరికి మూర్ఛ తగ్గడం లేదు. తలనొప్పి ఇతర సమస్యలు అలాగే ఉంటున్నాయని వైద్యులు తెలిపారు. ఆస్పత్రుల్లో చేరిన వారిని ప్రత్యేక వార్డులో పెట్టి పర్యవేక్షిస్తున్న వైద్యులు....రెండోసారి వ్యాధి లక్షణాలు కనిపించలేదని...భయం, మానసిక ఒత్తిడి వల్ల కొంతమంది ఇబ్బందికి గురయ్యారని వెల్లడించారు.

ఇదీ చదవండి: నేడు సిద్దిపేటలో కేసీఆర్‌ పర్యటన.. 1200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.