ETV Bharat / state

Organ Donations: అవయవదానంతో మరొకరికి ప్రాణ దానం.. - హైదరాబాద్ తాజా వార్తలు

Organ Donations: మరణం తర్వాత జీవించడమే అవయవదానంలో ఉన్న గొప్పతనం. మనం చనిపోతున్నా.. చావు బతుకుల మధ్య జీవం కోసం పోరాడుతున్న మరికొందరిని బతికించే అవకాశం ఒక్క అవయవదానంతోనే సాధ్యం. రాష్ట్రంలో దశాబ్దకాలం క్రితమే అయవదానం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం ప్రారంభించగా.. ఇటీవల అవయదానానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సుమారు వందకు పైగా డొనేషన్లు జరిగాయి.

అవయవదానం
అవయవదానం
author img

By

Published : Jul 5, 2022, 12:27 PM IST

అవయవదానంతో మరొకరికి ప్రాణ దానం

Organ Donations: మరణం తర్వాత మన అవయవాలు మరొకరికి ఉపయోగపడాలని కొరుకునేవారు అవయవదానాలు చేస్తుంటారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా అవయవదానాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటికే 106 మంది అయవయదానాలు చేసినట్టు జీవన్ దాన్ సంస్థ ప్రకటించింది. రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా 2013లో జీవన్ దాన్ పేరుతో అయవదాన కార్యక్రమానికి సర్కారు ఒక వేదికను ఏర్పాటు చేసింది.

నాటి నుంచి నేటి వరకు 1074 మంది దాతలు తమ అవయవాలను దానం చేయగా గతేడాది 2021లో అత్యధికంగా 162 అవయవదానాలు జరిగాయి. అయితే ఈ ఏడాది కేవలం ఆరు నెలల వ్యవధిలోనే 106 డొనేషన్లు జరగటం గమనార్హం. దీంతో జీవన్ దాన్ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాసుపత్పిలలో 400లకు పైగా అయయవ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించడం మరోవిశేషం.

గడిచిన దశాబ్ద కాలంగా అవయవ మార్పిడి సర్జరీల్లో ప్రథమ స్థానం కిడ్నీదే. అయితే గత రెండేళ్లుగా రాష్ట్రంలో ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలు సైతం గణనీయంగా పెరిగాయి. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఊపిరితిత్తుల మార్పిడికి తెలంగాణ వేదికగా మారుతోంది. జీవన్ దాన్ ప్రారంభమైనప్పటి నుంచి ఏడాదికి పది దాటని ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలు.. ఈ ఏడాది ఇప్పటికే 39 జరగటం విశేషం. గతేడాది అత్యధికంగా 83 మందికి ఈ తరహా శస్త్రచికిత్సలు జరిగాయి. 2013 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 1625 కిడ్నీ మార్పిడి సర్జరీ జరగగా.. తర్వాతి స్థానంలో 995 కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి.

రాష్ట్రంలో అవయవదానాల సంఖ్య పెరుగుతున్నప్పటికి .. ఇప్పటికి అవయవదానాల మీద ఉన్న అపోహల కారణంగా ఎంతో మందికి సరైన అవయవం దొరకక కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు అవయవదానానికి ముందుకొచ్చేలా ప్రమాణం చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది.

"కొవిడ్​కు ముందు కిడ్ని, కాలేయ మార్పిడిలు జరిగేవి. 2012లో జీవన్ దాన్​ను ప్రారంభించారు. కరోనా తరువాత ఊపిరితిత్తుల మార్పిడిలు ఎక్కువగా జరిగాయి. రాష్ట్రంతో పాటు దేశం అన్ని చోట్ల అవయవదానం గురించి ఉన్న సమాచారం మనకు తెలుస్తుంది." - డా.స్వర్ణలత జీవన్ దాన్ ఇంఛార్జ్

ఇదీ చదవండి: Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు..!

దంచికొట్టిన వానలు.. రైల్వేస్టేషన్ జలమయం.. మోకాళ్ల లోతు వరకు నీళ్లే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.