ETV Bharat / state

అధికార పక్షానికి దీటుగా విపక్షాలు - ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రచారాలు - congress party election campaign

Opposition parties Telangana Elections Campaign 2023 : రాష్ట్రంలో అధికార పక్షానికి దీటుగా విపక్షాలు జోరు పెంచాయి. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీలు ప్రభుత్వ తప్పొప్పులను ఎత్తిచూపుతూ, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. ముందుకు సాగుతున్నాయి. అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నాయి.

Telangana Assembly Elections 2023
Opposition parties Telangana Elections Campaign 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 8, 2023, 9:27 AM IST

అధికార పక్షానికి దీటుగా విపక్షాలు - ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రచారాలు

Opposition parties Telangana Elections Campaign 2023 : రాష్ట్రంలో అధికారమే ధ్యేయంగా జోరు పెంచి దూసుకెళ్తున్న విపక్షాలు.. ప్రచారాలతోనూ హోరెత్తిస్తున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్ గూడా డివిజన్ వెంకటగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్.. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మలక్‌పేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీదే విజయమని ఆ పార్టీ అభ్యర్థి షేక్ అక్బర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా నీలం మధు ముదిరాజ్‌కు టికెట్‌ ప్రకటించడంతో.. దిల్లీ నుంచి వచ్చిన నేతకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు బాహ్యవలయ రహదారి టోల్‌గేట్‌ వద్ద కార్లతో నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.

Congress Election Campaign in Telangana 2023 : కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెన్నెల గెలుపునకు కృషి చేయాలని ఏఐసీసీ మీడియా కోఆర్డినేటర్ షమా కోరారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమని.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పామేన భీమ్ భరత్ అన్నారు. చెవేళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని తెలిపారు.

ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారిన అసంతృప్తులు - కొనసాగుతున్న బుజ్జగింపులు

Telangana Assembly Elections 2023 : జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సింగపురం ఇందిర నామినేషన్ వేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీర్ల ఐలయ్య నివాసంలో ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కాంగ్రెస్​లో చేరారు. నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలో పార్టీ కార్యాలయాన్ని నారాయణ రావు పటేల్ ప్రారంభించారు. పార్టీ కార్యాలయం నుంచి జీఎం గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

మన పోటీ కారు గుర్తు అభ్యర్థితో కాదని.. సిద్దిపేట నుంచి వచ్చే మంత్రితో అని మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైనం పల్లి రోహిత్ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో దొరలపాలన కావాలా? ప్రజల పరిపాలన కావాలా ప్రజలు తేల్చుకోవాలి? అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించిందని వాటిని తూచ తప్పకుండా పాటిస్తామని హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితల ప్రణవ్‌ అన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న మహమ్మద్ షబ్బీర్ అలీకి నగర ఎన్ఎస్​యూఐ నాయకులు గజమాలతో ఘన స్వాగతం పలికారు.

అధికార బీఆర్ఎస్​కు దీటుగా ప్రచారాలతో హోరెత్తిస్తున్న విపక్షాలు రోడ్‌షోలు, బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్తున్న నేతలు

Telangana Election Campaign 2023 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా తుల ఉమను ప్రకటించడం పట్ల ఆ పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో కుటుంబ పార్టీలపై ప్రజలకు అసహనం పెరిగిందని గోవా ఎమ్మెల్యే కృష్ణ సవాల్కర్ అన్నారు. రాష్ట్రంలో కుటుంబ పార్టీలు ఉన్నాయని విమర్శించారు. మహబూబ్‌నగర్‌లో బీజేపీ నాయకులపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి నిరసన చేపట్టారు. పోలీసులు విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని హామి ఇవ్వడంతో నిరసన విరమించారు.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ బీఎస్పీ పార్టీ అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి మీర్పేట్​లోని మందమల్లమ్మ చౌరస్తా నుంచి భారీ కాన్వాయ్​తో మహేశ్వరంలో నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నిర్మించిన జలాశయాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సీపీఐ కాంగ్రెస్ సమావేశంలో జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సీపీఐ పనిచేస్తుందని, కేసీఆర్​ను ఓడించడమే తమ లక్ష్యమని చాడ అన్నారు.

రాజకీయ చైతన్యానికి కేరాఫ్‌ కరీంనగర్​లో ఈసారి కెప్టెన్సీ ఎవరిదో?

పల్లెబాట పట్టిన పార్టీలు - అధికారం దక్కాలంటే ఆమాత్రం తిప్పలు తప్పవు మరి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.