ETV Bharat / state

బీఆర్​ఎస్​ను గద్దెదించడమే లక్ష్యంగా విపక్ష పార్టీల జోరు - బీఆర్ఎస్​ ఎన్నికల ప్రచారం

Opposition Parties Election Campaign In Telangana 2023 : అధికార బీఆర్​ఎస్​ను గద్దెదించటమే లక్ష్యంగా విపక్ష పార్టీలు జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ.. ఇంటింటికి ప్రచారాలు, రోడ్‌షోలతో ప్రచారం నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రధానంగా ఆరు గ్యారంటీలను.. బీజేపీ అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ..ప్రజల్లోకి వెళ్తున్నారు.

Election Campaign In Telangana 2023
బీఆర్​ఎస్​ను గద్దెదించడమే లక్ష్యంగా విపక్ష పార్టీల జోరు
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 20, 2023, 10:51 AM IST

బీఆర్​ఎస్​ను గద్దెదించడమే లక్ష్యంగా విపక్ష పార్టీల జోరు

Opposition Parties Election Campaign In Telangana 2023 : మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావుకు మద్దతుగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా నియోజకవర్గ పరిధిలో రోడ్‌షో నిర్వహించారు. కుటుంబ పాలనను అంతమొందించి.. అభివృద్ధి, సంక్షేమం అందించే బీజేపీకి పట్టంకట్టాలని నడ్డా కోరారు. పరకాల బీజేపీ అభ్యర్థి కాళీ ప్రసాద్‌కు మద్దతుగా ఆ పార్టీ నేత ఈటల రాజేందర్‌ ప్రచారం నిర్వహించారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొనైమాకుల నుంచి ఊకల్ కార్నర్ వరకు రోడ్‌షో నిర్వహించిన ఈటల.. కాంగ్రెస్‌, బీఆర్​ఎస్​పై విమర్శలు గుప్పించారు.

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో ఈటలకు మద్దతుగా ఆయన సతీమణి జమున ఇంటింటికి వెళ్లి, ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్, గులాబీ పార్టీ అభ్యర్థులిద్దరూ కేసీఆర్‌ మనుషులేనని ఆమె ఆరోపించారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ విస్తృతంగా పర్యటించారు. నారాయణపేట జిల్లా మక్తల్ బీజేపీ అభ్యర్థి జలెందర్‌రెడ్డికి మద్దతుగా ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో కేసీఆర్​ సర్కార్‌ వైఫల్యాలు, కర్ణాటకలో కాంగ్రెస్‌ పాలనా తీరును వివరిస్తూ.. కమలం గుర్తుకు ఓటేయాలని ఆమె కోరారు.

హరీశ్​రావుకు పార్టీలో సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు : ఈటల రాజేందర్

కూకట్‌పల్లి కాంగ్రెస్‌ అభ్యర్థి బండి రమేశ్‌.. బాలాజీనగర్ డివిజన్‌లోని ఖైత్లాపుర్‌లో(Congress Election Campaign) ఇంటింటికి వెళ్లి, ఓట్లు అభ్యర్థించారు. ముషీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్‌కుమార్‌ యాదవ్‌కు మద్దతుగా ఆయన కుటుంబసభ్యులు ప్రచారం నిర్వహించారు. ఖమ్మం జిల్లా బోనకల్, చింతకాని మండలాల్లో మధిర కాంగ్రెస్ అభ్యర్థి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రచారం నిర్వహించారు. ఏపీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్‌అలీ.. భట్టి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు.

Seethakka Campaign In Mahabubabad : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ ప్రాంతంలో ములుగు కాంగ్రెస్‌ అభ్యర్థి సీతక్క ప్రచారం(Seethakka Election Campaign) నిర్వహించారు. ఆదివాసీ నృత్యాలతో ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. డోర్నకల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి రామచంద్రనాయక్‌.. కురవి మండలం నేరడ, తులస్యాతండా, లచ్చిరాం తండాలో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. మరిపెడ, దంతాలపల్లి మండలం గున్నేపల్లిలో బీజేపీ అభ్యర్థి భూక్యా సంగీత ప్రచారం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి బీఆర్ఎస్​ నేత పూలపల్లి వెంకటేశ్‌.. ఆలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి బీర్ల ఐలయ్య సమక్షంలో హస్తం గూటికి చేరారు. ఐలయ్య విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ..చొల్లేరుకు చెందిన ఆ పార్టీ కార్యకర్తలు యాదగిరిగుట్ట వరకు పాదయాత్ర చేశారు.

'వరాలు ప్రకటించేయ్‌-ఓట్లు పట్టేసెయ్‌'-మరి ఓటర్ల ఏ పార్టీ మేనిఫెస్టో వైపు మొగ్గు చూపుతారో?

Chada Venkat Reddy Fires On KCR : కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి వొడితెల ప్రవీణ్‌... జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో ప్రచారం చేశారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిని గెలిపించాలంటూ..ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. మెదక్‌ జిల్లా చిన్న శంకరంపేట మండలంలోని గ్రామాలు, తండాల్లో నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌ ఓట్లు అభ్యర్థించారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌కు మద్దతుగా ఆ పార్టీ నేత తీన్మార్ మల్లన్న ప్రచారం చేశారు. పెద్దపల్లిలో జరిగిన సీపీఐ సమావేశానికి హాజరైన చాడ వెంకట్‌రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి విజయరామారావును గెలిపించాలని కోరారు. ప్రజల ఆకాంక్షలను గౌరవించలేని కేసీఆర్‌కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చాడ పిలుపునిచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సంపత్‌ విస్తృతంగా పర్యటిస్తున్నారు. వడ్డేపల్లి పర్యటించిన సంపత్‌.. ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్‌ ప్రసంగంపై విమర్శలు చేశారు.

వరంగల్ జిల్లా నర్సంపేట్‌, వికారాబాద్‌లో తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా బీఎస్పీ అభ్యర్థి ఆర్​ఎస్​ ప్రవీణ్‌కుమార్‌.. ఎన్నికల ప్రచారం(BSP Election campaign) నిర్వహించారు. రోడ్‌షోగా వెళ్లి, ప్రచారం చేసిన ప్రవీణ్‌..బీఆర్ఎస్​, కాంగ్రెస్‌, బీజేపీలను నమ్మొద్దని కోరారు. సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో పటాన్‌చెరు బీఎస్పీ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారం చేశారు. ఖమ్మంలో తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించిన సదస్సుకు ఆచార్య హరగోపాల్‌ హాజరయ్యారు. తెలంగాణ ఆత్మగౌరవం వదిలేసి.. కేంద్రానికి కేసీఆర్​ గులాంగిరి చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.

ప్రచార జోరు పెంచిన బీజేపీ - రాష్ట్రానికి క్యూ కడుతోన్న అగ్రనేతలు - నేడు మరోమారు అమిత్​ షా సభ

ఆ పార్టీలోనే ఉండి నాకు ఓట్లు పడేలా చూడు - నిన్ను నేను చూసుకుంటా - అభ్యర్థుల వెంట ఉంటూ ప్రత్యర్థుల కోసం ప్రచారం

'బహుజన రాజ్య పాలనతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.