ETV Bharat / state

అన్నవరం.. ఆన్​లైన్ ద్వారా సత్యదేవుని వ్రతానికి శ్రీకారం

అన్నవరం దేవస్థానంలో ఆన్​లైన్ ద్వారా సత్యదేవుని వ్రతానికి శ్రీకారం చుట్టారు. శనివారం నుంచి భక్తులకు ఈ సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికి రూ.1,116 రుసుం నిర్ణయించారు.

అన్నవరం.. ఆన్​లైన్ ద్వారా సత్యదేవుని వ్రతానికి శ్రీకారం
అన్నవరం.. ఆన్​లైన్ ద్వారా సత్యదేవుని వ్రతానికి శ్రీకారం
author img

By

Published : Oct 1, 2020, 10:19 PM IST

ఏపీ తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ఆన్​లైన్ ద్వారా సత్యదేవుని వ్రతానికి శ్రీకారం చుట్టారు. భక్తులు పరోక్ష పద్ధతిలో స్వామివ్రతంలో పాల్గొనే విధంగా రూపొందించిన కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. శనివారం నుంచి భక్తులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం స్వామి, అమ్మవారు, పరమేశ్వరుడుల విగ్రహాలతో ప్రత్యేకంగా ముస్తాబు చేసిన స్టూడియోలో దేవస్థానం ఈవో త్రినాధరావు జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత వైదిక బృందం ఆధ్వర్యంలో వ్రత పూజలు నిర్వహించారు.

పురోహితులు నిర్వహించే వ్రతపూజను వీడియో కెమెరాల ద్వారా చిత్రీకరించి యూట్యూబ్​కు అనుసంధానం చేశారు. ఈ యూట్యూబ్ లింకు ద్వారా ఆన్​లైన్​లో వీక్షించే విధంగా ఏర్పాటు చేశారు. దేవస్థానం వెబ్​సైట్ ద్వారా పూజకు రుసుము చెల్లించిన వారికి ఆలయ అధికారులు యూట్యూబ్ లింకు పంపిస్తారు. దీని ద్వారా భక్తులు స్వామివారి వ్రతం వీక్షించే అవకాశం ఉంటుంది. పురోహితులు చెప్పే విధంగా ఇంట్లో కూడా వ్రతం చేసుకునే అవకాశం కలుగుతుంది. దీనికి రూ.1,116 రుసుం నిర్ణయించారు.

ఇదీ చదవండి: నయనానందరకరం.. తిరుమలలో వైభవంగా శ్రీవారి చక్రస్నానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.