ఆరోవిడత హరితహారం కొనసాగుతున్న తీరు.. ప్రతి గ్రామంలో ఒక ప్రకృతి వనం ఏర్పాటుపై అటవీశాఖ ఉన్నతాధికారులు ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బందితో పీసీసీఎఫ్ శోభ, ఇతర ఉన్నతాధికారులు దృశ్యమాధ్యమం ద్వారా చర్చించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలను అనువుగా తీసుకుని మొక్కలు నాటే ప్రక్రియ కొనసాగించాలని సూచించారు. కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో ప్రతి పల్లెలో ఒక ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశించారని.. గుర్తు చేశారు. యాదాద్రి నమూనా తరహాలో తక్కువ ప్రాంతంలో ఎక్కువ విభిన్న రకాల మొక్కలు నాటాలని ఉన్నతాధికారులు తెలిపారు.
ఈ ఆన్‌లైన్ సమావేశంలో ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులు కూడా పాల్గొన్నారు. తెలంగాణ అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బందితో నిర్వహిస్తున్న ఆన్‌లైన్ మీటింగ్ వివరాలు, వాడుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు, యాదాద్రి నమూనా మొక్కలు నాటే విధానం, వివరాలను కూడా ఇతర రాష్ట్రాల అధికారులు అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చూడండి:- రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!