ETV Bharat / state

Online Mapping: ప్రమాద ప్రాంతాల్లో కూడా సమాచారం ఇవ్వొచ్చు

మహిళలు, యువతుల రక్షణను మరింత పటిష్ఠ పరిచేందుకు పోలీసుశాఖ ప్రయత్నిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే మహిళల భద్రత కోసం ప్రత్యేక యాప్​లు రూపొందిస్తుంది. మహిళలు... యువతుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వారికి ఇబ్బందులు కలిగించే ప్రాంతాల వివరాలను తెలపాలంటూ విజ్ఞప్తులు చేస్తోంది.

Online Mapping
Online Mapping
author img

By

Published : Sep 10, 2021, 9:40 AM IST

రాజధానిని మరింత సురక్షితంగా మార్చేందుకు పోలీసులకు పౌరులు సహకారం అందించొచ్చు. డయల్‌ 100 ద్వారా ప్రమాద సమాచారాలను అందిస్తున్నా.. ఆన్‌లైన్‌ మ్యాపింగ్‌ ద్వారా సురక్షితం కాని ప్రాంతాలను వివరించేందుకు అవకాశాలున్నాయి. విదేశాలో నేరనియంత్రణకు అక్కడి పోలీస్‌ యంత్రాంగం ప్రజల భాగస్వామ్యం కోరుతోంది. చిన్నారులు.. మహిళలు... యువతుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వారికి ఇబ్బందులు కలిగించే ప్రాంతాల వివరాలను తెలపాలంటూ విజ్ఞప్తులు చేస్తోంది. మనం కూడా మహిళా భద్రతకు ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న యాప్‌లు.. సామాజిక మాధ్యమాల్లో వివరాలను చెబితే స్పందించి కార్యచరణ రూపొందించనున్నారు. దేశంలో స్త్రీ వ్యతిరేక హింస క్రమంగా తగ్గుతున్న నగరాల జాబితాలో హైదరాబాద్‌ ఇప్పటికే ఉన్నందున ప్రజలు మరింత సమాచారాన్ని అందిస్తే ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు.

ఆన్‌లైన్‌ మ్యాపింగ్‌ అంటే...

ఆన్‌లైన్‌ మ్యాపింగ్‌ అంటే ఫలానా ప్రాంతంలో రాత్రుళ్లు మహిళలు, యువతులు వారి గమ్యస్థానాలు చేరుకునేందుకు సరైన రవాణా సౌకర్యాలు లేవని ప్రజలు భావిస్తే ఆ ప్రాంతం వివరాలు మ్యాప్‌లో నమోదు చేసి పోలీసులకు పంపాలి. పోలీసులు స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించి, రక్షణ చర్యలు చేపడతారు.

  • అనూహ్య ఘటనలు కనిపించగానే ఆ ప్రాంతం వివరాలను మ్యాప్‌లో నమోదు చేయడం ద్వారా పోలీసులకు వేగంగా సమాచారం అందుతుంది. పోలీసుల కంటే వేగంగా అంబులెన్స్‌లు, అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకుంటాయి.
  • నగరంలో వివిధ కారణాలతో రాత్రుళ్లు ప్రయాణాలు కొనసాగిస్తున్న మహిళలు, యువతులకు రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

హాక్‌ ఐ యాప్‌.. వివరాలన్నీ నమోదు..

హైదరాబాద్‌ పోలీసులు వ్యక్తిగత రక్షణ, సామాజిక అవసరాల కోసం ‘హాక్‌ ఐ’ మొబైల్‌యాప్‌ను ఆరేళ్ల క్రితం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న ప్రతి ఒక్కరూ తమకు తెలిసిన సమాచారాన్ని చిత్రాలు, వీడియోల ద్వారా పోలీసులకు సమాచారం పంపించేందుకు వీలుంది.

  • ఈ యాప్‌లోనే మహిళలు, యువతులకు రక్షణగా ఎస్‌ఓఎస్‌ మీటను అందుబాటులోకి తెచ్చారు. ఆపదలో ఉన్నవారు ఎస్‌.ఒ.ఎస్‌. మీటను నొక్కితే చాలు.. కమాండ్‌ కంట్రోల్‌ రూంకు బాధితులున్న ప్రదేశం క్షణాల్లో తెలుస్తుంది. బాధితులను రక్షించేందుకు సమీపంలోని పెట్రోలింగ్‌ బృందాలు అప్రమత్తమవుతాయి.
  • రాత్రివేళల్లో ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణించే మహిళా ప్రయాణికులు, ఐటీ సంస్థలు, కాల్‌సెంటర్లలో విధులు నిర్వహించే యువతులు వారి గమ్యస్థానాలు సురక్షితంగా చేరేందుకు తమ చరవాణిలో హాక్‌ఐ ద్వారా సంక్షిప్త సందేశాన్ని పంపితే వారి ప్రయాణమంతా పోలీసులు పరోక్షంగా తోడుగా ఉంటారు. ‘థ్యాంక్‌ యూ’ అంటూ యువతులు మళ్లీ సందేశం పంపేంత వరకూ పోలీసులు గమనిస్తూనే ఉంటారు.

ఇదీ చూడండి: GANG RAPE: వేటకొడవళ్లతో బెదిరించి.. భర్తను కట్టేసి.. భార్యపై అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.