ETV Bharat / state

హవాలా మార్గంలో చైనాకు భారీగా నిధుల బదిలీ

ఆన్‌లైన్‌ గేమింగ్‌ వ్యవహారంలో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు... విచారణలో అనేక విషయాలు రాబట్టారు. ప్రధానంగా హవాలా రూపంలో మూడు నెలల్లో వంద కోట్ల రూపాయలను తరలించినట్టు గుర్తించిన పోలీసులు... దిల్లీతో పాటు మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గేమింగ్‌ కంపెనీల బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్నారు.

online gaming case Hyderabad Polices arrested  four members
హవాలా మార్గంలో చైనాకు భారీగా నిధుల బది
author img

By

Published : Aug 25, 2020, 5:14 AM IST

అంతర్జాలంలో బెట్టింగ్ నిర్వహిస్తూ వందల కోట్ల రూపాయలు హవాలా రూపంలో దేశం దాటిస్తున్న ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వాహకులు దిల్లీకే పరిమితం కాలేదని సైబర్‌ క్రైమ్‌ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రల్లోనూ డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసినట్టు విచారణ అధికారులకు ఆధారాలు లభించాయి. 20కి పైగా ఉన్న ఈ కంపెనీల్లో ప్రధాన డైరెక్టర్లుగా ఎక్కువ శాతం చైనీయులే ఉన్నారని... వాటికి అనుబంధంగా మరికొన్ని కంపెనీలున్నాయని గుర్తించారు. ఆయా కంపెనీల నుంచి కోట్ల రూపాయల విలువైన లావాదేవీలు జరిగినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు.

మూడు నెలల్లో... 100 కోట్లు

కాగితాలపై ప్రారంభించిన ఈ కంపెనీల చిరునామాలు ఒకేచోట ఉండటం వల్ల అనుమానం వచ్చి రికార్డులు పరిశీలించటంతో ఇవి బయటపడ్డాయి. ఆన్‌లైన్‌ బెట్టింగ్ కేసులో ఉన్న డోకీపీ, లింయున్ సంస్థలతో డొల్ల కంపెనీలకు సంబంధాలున్నాయి. యాహువో సహకారంతో 30 కంపెనీలను స్థాపించిన చైనీయులు హవాలా మార్గంలో మూడు నెలల్లో 100 కోట్లు తరలించినట్టు దర్యాప్తులో తేలింది.

ఎవరినీ వదిలిపెట్టం

దిల్లీతో పాటు , మహరాష్ట్ర , యూపీలోని కంపెనీల బ్యాంక్ లావాదేవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులు యాహువో, ధీరజ్, అంకిత్‌, నీరజ్‌లను ఎన్ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట‌్, ఆదాయపు పన్ను శాఖ అధికారులు మొదటి రోజు విచారించారు. హవాలా సొమ్ము, పన్ను ఎగవేత అంశాలపై వారిని ప్రశ్నించినట్టు తెలిసింది. తాము ఆర్ధిక లావాదేవీలు నిర్వహించబోమని... కేవలం డిజిటల్ నగదు సమూహాన్ని సేకరించి ఆయా కంపెనీలకు బదిలీ చేస్తున్నామని ఇందుకు రుసుం కూడా తీసుకుంటున్నామని అధికారులకు యాహువా చెప్పినట్టు సమాచారం. బెట్టింగ్ రాకెట్‌లో ప్రస్తుతం నలుగురు నిందితుల పైనే కేసు నమోదు చేశామని... హవాలా మార్గంలో సొమ్ము తరలించిన వారిని సహనిందితులుగా చేర్చనున్నామని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: కూలిన ఐదంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.