ETV Bharat / state

ఆన్​లైన్​లో నగదు దోపిడి.... కొత్త తరహాలో కేసులు - సైబర్ నేరాలు

సైబర్ నేరాలు క్రమంగా పెరుగుతున్నాయి. సాంకేతిక వినియోగాన్ని దుర్వినియోగం చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు. బ్యాంకు అధికారులమని, ఖాతాను అప్​డేట్ చేసుకోవాలని మాయ మాటలు చెప్పి... నగదును లాగేసుకుంటున్నారు. రోజురోజుకూ ఈ తరహా కేసులు ఎక్కువవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే ఇక అంతే సంగతులు.

online fraud New cases in hyderabad
ఆన్​లైన్​లో నగదు దోపిడి.... కొత్త తరహాలో కేసులు
author img

By

Published : Jun 4, 2020, 9:25 AM IST

సైబర్ నేరగాళ్లు రోజుకో తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. మోసాల గురించి పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. కొంత మంది ప్రజలు మాత్రం మోసగాళ్లకు బలవుతూనే ఉన్నారు. కేటుగాళ్ల చేతుల్లో పడి బాధితులు నిండా మునిగిపోతున్నారు. రోజురోజుకు కొంత పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు అమాయకులను సులభంగా మోసం చేస్తున్నారు. బ్యాంకు అధికారులమని చెప్పి నమ్మించి ఖాతా వివరాలు, రహస్య నెంబర్ గురించి తెలుసుకుని ఖాతాలోని నగదును మాయం చేస్తున్నారు. ఇటీవల డిజిటల్ లావాదేవీలు పెరగడం వల్ల చాలామంది వాలెట్లు, యూపీఐల ద్వారా నగదు బదిలీ చేస్తున్నారు.

వాలెట్ స్తంభించి పోతుందని..

దానిని ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు.. 24 గంటల్లో కేవైసీ అప్​డేట్ చేసుకోవాలని లేకపోతే వాలెట్ స్తంభించి పోతుందని సందేశం పంపుతున్నారు. సదరు నెంబర్​కు ఫోన్​చేస్తే లింకు పంపించి అందులో వివరాలు నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. మరికొంత మంది నేరగాళ్లేమో క్విక్ సపోర్ట్, ఎనీ డెస్క్, టీం వ్యూవర్ వంటి రిమోట్ అప్లికేషన్లను డౌన్​లోడ్ చేసుకోమంటున్నారు. ఆ తర్వాత కనీసం 10 రూపాయలను ఖాతాలో జమ చేసుకోవాలని ఖాతాదారుడికి సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఖాతాదారుడు డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలు, రహస్య నెంబర్ అన్ని నమోదు చేసే సమయంలో రిమోట్ ద్వారా సైబర్ నేరగాళ్లు వివరాలను మొత్తం తెలుసుకుంటున్నారు. ఇలా అమాయకులను పలు రకాలుగా మోసం చేస్తున్నారు.

ఈసారి మూడు రెట్లు పెరిగే అవకాశం

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలు క్రమంగా పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది. 2018లో 293 కేసుల్లో 16 కోట్ల రూపాయలను బాధితులు కోల్పోయారు. 2019లో 477 కేసుల్లో 25 కోట్ల రూపాయల దాకా మోసాలు జరిగాయి. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లోనే దాదాపు 490 కేసులు కావడం గమానార్హం. ఈ కేసుల్లోనూ సుమారు 25 కోట్ల నగదును బాధితులు కోల్పోయారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఓఎల్ఎక్స్ మోసాలు కాస్త తగ్గినట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. బ్యాంకు నుంచి ఫోన్ చేసే అధికారులెవరూ ఖాతా వివరాలు అడగరని.. ఎట్టి పరిస్థితుల్లోనూ రహస్య నెంబర్, ఇతర వివరాలు చెప్పొద్దని బ్యాంకు అధికారులు, పోలీసులు చెబుతున్నారు. ఒకవేళ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వెంటనే పోలీస్ స్టేషనన్​లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి : నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.