ETV Bharat / state

'సరదాగా మొదలెడితే వ్యసనంగా మారుతోంది.. జీవితాలను ఆగం చేస్తోంది'

author img

By

Published : May 16, 2022, 11:20 AM IST

Online Casino: జూదం సరదాగా మొదలెడితే.. అదే వ్యసనంగా మారుతోంది. ఒక్కసారి అలవాటైతే ఇక మన కథ కంచికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆన్​లైన్​ బెట్టింగ్​ల రాజ్యమే నడుస్తోంది. పందేల మోజులో పడి కొందరు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. హైదరాబాద్ అడ్డాగా కోట్ల రూపాయల బెట్టింగ్​దందా జరుగుతోంది. బెట్టింగుల్లో నష్టపోయిన యువకులు మోసాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

Online cricket bettings
ఆన్​ లైన్ జూదం

Online Casino: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు అలవాటుపడిన ఓ యువకుడు.. తల్లి నగలు కొట్టేశాడు. గుర్రపు పందేలు ఆడేందుకు బీటెక్‌ పట్టభద్రుడు.. ఏకంగా అమ్మాయిలను మోసగించాడు. తాజాగా బ్యాంకు క్యాషియర్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ల కోసం చేసిన అప్పులు తీర్చేందుకు బ్యాంకు సొమ్ము రూ.25 లక్షలతో పారిపోయాడు. ఇలా నగరంలో ఎటుచూసినా.. ఏదోమూలన బెట్టింగ్‌ మాయలో యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కుర్రకారుకు లాభాలను ప్రలోభ పెడుతూ బెట్టింగ్‌ నిర్వాహకులు కోట్లాది రూపాయలు వసూలు చేస్తూనే ఉన్నారు. పందేలకు చేసిన ఖర్చులను తీర్చేందుకు మళ్లీ లోన్‌ యాప్‌లను ఆశ్రయిస్తున్నారు. అక్కడ చక్రవడ్డీలు చెల్లించలేక నేరాలకు పాల్పడేంతగా దిగజారుతున్నారు. హైదరాబాద్‌ మహానగరంలో బెట్టింగ్‌ క్రేజ్‌ను సొమ్ము చేసుకునేందుకు రాజస్థాన్, గుజరాత్, దిల్లీ, ముంబయి, బెంగళూరు నుంచి ప్రధాన బుకీలు నగరం చేరుతున్నారు. ఇక్కడ ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని యువతకు ఆన్‌లైన్‌ ద్వారా వల విసురుతున్నారు.

ఆటవిడుపుగా మొదలైన జూదం.. జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. కుటుంబాలు వీధిన పడేందుకు కారణమవుతోంది. పేకాట, గుర్రపు పందేల వ్యసనంతో వేలాది మంది అప్పుల పాలవుతున్నారు. తీర్చేదారి తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారూ ఉన్నారు. మహా నగరంలో పందేల ముసుగులో ప్రతిరోజూ రూ.10-20 కోట్ల మేర చేతులు మారుతుంటాయని అంచనా వేస్తున్నారు. అపార్ట్‌మెంట్స్, రిసార్ట్స్, ఫామ్​ హౌస్‌లోని గదులను రోజు/నెలవారీ అద్దెకు తీసుకున్న నిర్వాహకులు కమీషన్‌ ప్రాతిపదికన పేకాట క్లబ్బులను ఏర్పాటు చేస్తున్నారు. రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులకు సన్నిహితులుగా మెలిగే వారే అధిక శాతం పేకాట స్థావరాలను నిర్వహిస్తుండటం విశేషం.

పెద్దమొత్తంలో జరిగే పందేలను అడ్డగించేందుకు కొన్నిచోట్ల స్థానిక పోలీసులు వెనుకంజ వేస్తుంటారనే విమర్శలున్నాయి. వారాంతపు సమయాల్లో ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు, ప్రజాప్రతినిధులు నగరంలో పేకాట ఆడేందుకు వస్తుంటారు. సికింద్రాబాద్, అబిడ్స్, బేగంబజార్, ఘాన్సీబజార్, చాంద్రాయణగుట్ట, టోలీచౌకి, మాదాపూర్, గచ్చిబౌలి, చందానగర్, నర్సాపూర్, శామీర్‌పేట్‌ చోట్ల పందేలు ఎక్కువగా సాగుతున్నట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన పేకాటరాయుళ్లు.. శివారు ప్రాంతాల్లో ఖాళీ ప్రదేశాలను అడ్డాగా మార్చుకుంటున్నారు. రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు కీసర, మల్కాజిగిరి, రామన్నపేట తదితర ప్రాంతాల్లో సుమారు 20-30 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్‌ చేశారు. వీరిలో కార్మికులు, చిరుద్యోగులున్నట్టు పోలీసులు తెలిపారు. ఏళ్ల తరబడి అలవాటుపడిన వీరంతా.. సంపాదనలో 90 శాతం పందేలకు కుమ్మరిస్తున్నట్టు నిర్దారించారు.

వీరి వ్యసనం.. వారికి రాబడి: ఏపీ, రాజస్థాన్, గుజరాత్‌లకు చెందిన నిర్వాహకులు నగరాన్ని పందేలకు అడ్డాగా మార్చుకున్నారు. పేకాట, గుర్రం, క్యాసినో ఆసక్తి ఉన్న పందెపురాయుళ్లను ఆకట్టుకునేందుకు ఏజెంట్లను నియమిస్తున్నారు. వీరి ద్వారా పందెం జరిగే ప్రదేశాలు, నగదు లావాదేవీలు కొనసాగిస్తుంటారు. అసలు సూత్రధారులు తెరవెనుక ఉంటూ ఏజెంట్ల ద్వారా వ్యవహారం చక్కబెడుతుంటారని నగరానికి చెందిన పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఎన్నిసార్లు అరెస్ట్‌ చేసి జైలుకు పంపినా బయటకు రాగానే చోటు మార్చి మళ్లీ ఇవే పందేలు నిర్వహిస్తుంటారని తెలిపారు.

పేకాట చట్టవిరుద్ధం. పేకాడుతూ పట్టుబడితే జైలుకెళ్లటం ఖాయం. ఇలాంటి పందేల వల్ల కుటుంబాలకు కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. సమాజంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. జూద గృహాలపై పోలీసుల నిఘా కొనసాగుతుంది. ఆడినా, నిర్వహించినా కేసులు నమోదు చేస్తున్నాం. ప్రజల్లో జూదం వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజలు కూడా ఇటువంటి వ్యసనాలకు దూరంగా ఉండాలనేది నా సూచన.

-జి. శ్రీధర్‌, సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ

క్యాసినో, పేకాటకు అలవాటు పడిన సంపన్నులు, వ్యాపారులు, ఉన్నతోద్యోగులను గోవా, శ్రీలంక, మలేషియా, సింగపూర్‌ తీసుకెళ్లేందుకు అక్కడి ట్రావెల్‌ సంస్థలు తమ ఏజెంట్లను నగరానికి పంపుతుంటాయి. వీరి ద్వారా వెళ్లే అతిథులకు ఆయా ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాసినో వద్ద ప్రత్యేక రాయితీలు ఇస్తుంటారు. నగర శివారు ప్రాంతానికి చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారి 2-3 నెలలకోసారి రూ.5 లక్షలతో క్యాసినో కోసం గోవా వెళ్తుండేవాడు. చెన్నై, హైదరాబాద్‌లో గుర్రపు పందేలు కాసేవాడు. భారీగా నష్టాలు రావటంతో అడ్డదారి తొక్కాడు. వాట్సాప్‌ గ్రూపులు రూపొందించి గుర్రపు పందేల ఫొటోలను ఉంచుతూ పందెపు రాయుళ్ల నుంచి పెద్దఎత్తున డబ్బు వసూలు చేసేవాడు. పందేల్లో నష్టపోయారంటూ డబ్బు తన ఖాతాలో జమచేసుకునేవాడు. ఇటీవల రాచకొండ పోలీసులు నిందితుడుని అరెస్ట్‌ చేసినపుడు పందేల్లో పోయిన సొమ్ము.. అక్కడే రాబట్టుకునేందుకు ఇలా అడ్డదారి తొక్కానంటూ చెప్పటం పోలీసులను విస్మయానికి గురిచేసింది.

మాదాపూర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. వాట్సాప్‌ లింక్‌ ద్వారా క్యాసినోకు అలవాటయ్యాడు. గెలిచినపుడు బాగా డబ్బు రావటంతో మరింత పందేలు కాస్తూ రూ.కోటిన్నర వరకూ చేరాడు. తన బ్యాంకు ఖాతా నుంచి పెద్దఎత్తున డబ్బు మాయమవటంతో బాధితుడి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. నకిలీ యాప్స్‌ ద్వారా క్యాసినో ఆటలో పాల్గొని గెలవమంటూ సైబర్‌ నేరస్థులు ప్రకటనలిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ జి. శ్రీధర్‌ హెచ్చరించారు.

ఇవీ చూడండి: బ్యాంకులో నగదు మాయం కేసు.. క్యాషియర్ ప్రవీణ్ వాహనం గుర్తింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.