కొవిడ్-19 నేపథ్యంలో ఈ ఏడాది ఆన్‌లైన్ ద్వారా కౌన్సెలింగ్ చేయాలని ఏపీలోని ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరానికి బీఎస్సీ వ్యవసాయం, ఉద్యానం, వెటర్నరీ సైన్సు, మత్స్య కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం అవసరమయ్యే సాంకేతిక సహకారం అందించాలని ఉన్నత విద్యామండలిని వర్సిటీ కోరింది. ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులకు నిర్వహిస్తున్నట్లే ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ఉంటుంది.
వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఆరు అనుబంధ కళాశాలలు ఉండగా.. ఐదు ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 1,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా మ్యాన్‌వల్‌గా కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఇదీ చూడండి: సన్నాల అవస్థ: 'వందల మందిలో 50మందికే టోకెన్లు'