ఎంసెట్, జేఈఈ, నీట్‌కు సిద్ధమవుతున్న ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు... ఉచిత ఆన్లైన్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ కోరారు. లాక్డౌన్ కారణంగా ఈ ఏడాది వీడియోలు, ఆన్లైన్ పరీక్షల ద్వారా కోచింగ్‌కు ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు.
ఏప్రిల్ 20 నుంచి రోజూ, వారం వారీ, గ్రాండ్ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించి.. విశ్లేషించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లోని లింక్ ద్వారా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వెల్లడించారు. రోజూ 40 ప్రశ్నలతో పరీక్ష ఉంటుందని.. గ్రాండ్ టెస్టు 160 ప్రశ్నలతో నిర్వహిస్తామని చిత్ర రామచంద్రన్ పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా కూడా శిక్షణ పరీక్షల్లో పాల్గొనవచ్చునన్నారు.
ఇదీ చదవండిః ఈటీవీ కథనానికి స్పందన.. బుడగ జంగాల కూలీలకు సాయం