ETV Bharat / state

ONLINE CLASSES: ఆన్​లైన్​​ పాఠాలు మళ్లీ వినాలంటే?.. 'దీక్ష' చేపట్టాల్సిందే!

రాష్ట్రంలోని విద్యార్థులకు టీవీల ద్వారా పాఠాలు ప్రసారం చేస్తున్నారు... వాటిని మళ్లీ వినాలనిపిస్తే టీశాట్‌ యాప్‌లో పొందొచ్చు. ఆ పాఠ్యాంశాలపై మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే?.. సీబీఎస్‌ఈ లేదా ఇతర రాష్ట్రాల ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు వినాలంటే?...అందుకు సమాధానమే దీక్ష యాప్‌.

online classes read and watch videos with diksha app
ఆన్​లైన్​​ పాఠాలు మళ్లీ వినాలంటే?.. 'దీక్ష' చేపట్టాల్సిందే!
author img

By

Published : Jun 17, 2021, 9:50 AM IST

పాఠశాలలు తెరుచుకోని ఈ పరిస్థితుల్లో దీక్ష వేదిక ద్వారా బహుళ ప్రయోజనాలు పొందొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దేశంలో డిజిటల్‌ విద్యను ప్రోత్సహించేందుకు... అన్ని రాష్ట్రాల డిజిటల్‌ పాఠాలను ఒక వేదిక పరిధిలోకి తీసుకొచ్చి పరస్పరం జ్ఞానాన్ని పంచుకోవాలన్న లక్ష్యంతో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) ఆధ్వర్యంలో 2017 సెప్టెంబరులో రూపుదిద్దుకున్నదే డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫర్‌ నాలెడ్జి షేరింగ్‌(దీక్షా). కేవలం విద్యార్థులకే కాకుండా ఉపాధ్యాయులకూ ఉపయోగపడేలా ఈ పోర్టల్‌ను, యాప్‌ను రూపొందించారు. నాలుగేళ్లవుతున్నా దీన్ని వినియోగించుకోవడంలో రాష్ట్రం వెనకబడింది. ఇప్పటివరకు తెలంగాణ నుంచి 3.80 లక్షల మంది విద్యార్థులే ఈ వేదిక ద్వారా పాఠాలు విన్నారు. ఫలితంగా రాష్ట్రం 21వ స్థానంలో నిలిచింది. కోటిన్నర మంది విద్యార్థులతో ఏపీ మొదటి స్థానంలో ఉంది. దీనిపై ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో మరింత అవగాహన పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకే దేశం...ఒకే వేదిక నినాదంతో తీసుకొచ్చిన దీన్ని అన్ని రాష్ట్ర విద్యాశాఖలు, విద్యార్థులు ఉచితంగా వినియోగించుకొని ప్రయోజనం పొందాలని ఇటీవల కేంద్రం కోరింది.
ఇవీ ప్రయోజనాలు...

*స్మార్ట్‌ఫోన్‌ ద్వారా గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి దీక్ష యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి కావాల్సిన తరగతి పాఠ్య పుస్తకాలను చదువుకోవచ్చు. ఆయా పాఠ్యాంశాలపై ఉపాధ్యాయులు రూపొందించిన వీడియో పాఠాలు వినొచ్చు. దీక్ష అనే పోర్టల్‌ ద్వారా కూడా ఈ సేవలు పొందొచ్చు.

* ఆయా పాఠ్యాంశాలు ప్రస్తుతం 18 భాషల్లో అందుబాటులో ఉన్నాయి.

* విద్యార్థులకు ఎంత వరకు అర్థమైందో తెలుసుకునేందుకు ప్రశ్నావళి కూడా ఉంటుంది. ప్రశ్నలకు జవాబులిచ్చి మార్కులు పొందొచ్చు. క్వశ్చన్‌ బ్యాంకులు, క్విజ్‌లు తదితర పలు అంశాలుంటాయి.

* దీక్ష వేదికను వినియోగించుకొని ఆన్‌లైన్‌లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చుకోవచ్చు. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) ఉపయోగించుకోవచ్చు. చిన్న కోర్సులు కూడా నడపొచ్చు.

ఈ ఏడాది పెరుగుతారు: ఎస్‌సీఈఆర్‌టీ

గత రెండేళ్లలో 8,9 తరగతుల్లోని కొన్ని పాఠ్య పుస్తకాల్లోని క్విక్‌ రెస్పాన్స్‌(క్యూఆర్‌) కోడ్‌ ముద్రించారు. వచ్చే విద్యా సంవత్సరానికి(2021-22) 6-10 తరగతుల్లోని అన్ని సబ్జెక్టుల్లో క్యూఆర్‌ కోడ్‌ ప్రవేశపెడుతున్నారు. దానివల్ల వద్యార్థులు దీక్ష యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని స్కాన్‌ చేస్తారని, రాష్ట్రం నుంచి ఆ యాప్‌ ను ఉపయోగించుకునే వారి సంఖ్య బాగా పెరుగుతుందని ఎస్‌సీఈఆర్‌టీ అధికారులు చెబుతున్నారు.

.

ఇదీ చదవండి: KTR: రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.