ETV Bharat / state

ఈనెల 20 నుంచి హెచ్​సీయూలో ఆన్​లైన్​ తరగతులు - హైదరాబాద్​ వార్తలు

పీజీ విద్యార్థులకు ఈనెల 20 నుంచి ఆన్​లైన్ తరగతులు ప్రారంభించాలని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. టాస్క్ ఫోర్స్ బృందం ఇచ్చిన సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

online clases will start from 20th august in hcu
ఈనెల 20 నుంచి హెచ్​సీయూలో ఆన్​లైన్​ తరగతులు
author img

By

Published : Aug 6, 2020, 6:35 PM IST

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఈనెల 20 నుంచి ఆన్​లైన్ తరగతులు నిర్వహించనున్నారు. కరోనా కారణంగా మార్చి 25 నుంచి నిలిచిపోయిన విద్యా సంవత్సరం ఎలా ప్రారంభించాలో సూచించేందుకు టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్ బృందం ఇచ్చిన సూచనలపై వీసీ అప్పారావు గురువారం యూనివర్సిటీలోని వివిధ విభాగాల అధిపతులు, డీన్​లతో సమావేశమై చర్చించారు.

టాస్క్ ఫోర్స్ సూచనల మేరకు ఈ నెల 20 నుంచి ఆన్​లైన్ తరగతులు ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. పేద విద్యార్థులకు ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం వెయ్యి రూపాయల డిజిటల్ యాక్సెస్ గ్రాటు ఇవ్వాలని యూనివర్సిటీ నిర్ణయించింది. గతంలో హాస్టల్ విద్యార్థులకు ఇచ్చే నిధులని ఇంటర్నెట్ సదుపాయం కోసం ఇవ్వాలన్న టాస్క్ ఫోర్స్ సిఫార్సును ఆమోదించింది.

యూనివర్సిటీ పై ఆశతో దేశ వ్యాప్తంగా వేలాది మంది ఉన్నారని.. వారందరికీ నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ఉందని వీసీ పేర్కొన్నారు. నాణ్యమైన డిజిటల్ బోధన కోసం వివిధ విభాగాలు, అధ్యాపకులకు తగిన వనరులను సమకూర్చనున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:- ఆడపిల్ల పుట్టిందని అమ్మానాన్నే బావిలో పడేశారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.