ఆన్లైన్లో టీషర్ట్‌ల పేరిట మోసం చేసిన సైబర్ కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లాలాగూడ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు.. లైంరోడ్ వెబ్సైట్ ద్వారా రెండు టీ-షర్టులు ఆర్డర్ చేశాడు. ఒకటి మాత్రమే రాగా కస్టమర్ కేర్‌ను సంప్రదించారు. దీన్ని ఆధారం చేసుకున్న కేటుగాళ్లు... ఓటీపీ నెంబర్ ద్వారా యువకుడి అకౌంట్లో ఉన్న రూ. 35 వేలు మాయం చేశారు.
ఘటనతో ఖంగుతిన్న యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా.. ఝార్ఖండ్‌కు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు గుర్తించారు. వారిద్దరినీ అక్కడ అరెస్ట్ చేసి ట్రాన్సిట్ రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చూడండి: 'కరోనాపై యుద్ధం కోసం.. వచ్చే ఆదివారం జనతా కర్ఫ్యూ'