Online Betting on Telangana Assembly Elections : రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఓ వైపు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రచారంతో హోరెత్తిస్తుంటే.. మరోవైపు బెట్టింగ్ రాయుళ్లు ఏ పార్టీ గెలుస్తుందోనని ఫోకస్ పెట్టారు. ఇందుకోసం ఫలానా పార్టీ గెలుస్తుందంటూ వేల నుంచి లక్షల వరకూ బెట్టింగులు కాస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రద్దీ ప్రాంతాలలో సైతం పోస్టర్లను అంటిస్తూ అమాయకులకు గాళం వేస్తున్నారు.
Telangana Assembly Elections 2023 : ఇప్పటి వరకు క్రికెట్, ఇతరత్రా పోటీలపై బెట్టింగులు నిర్వహించిన ఆన్‌లైన్ వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లు.. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కన్నేశాయి. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల్లో ఏ పార్టీ, ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంచనాలపై వేర్వేరు బెట్టింగ్ సంస్థలు పందేలు నిర్వహిస్తున్నాయి. ప్రముఖులు ప్రచారకర్తలుగా ఆయా సంస్థల వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లకు విస్తృత ప్రచారం కల్పిస్తుండటం, వెబ్‌సైట్లు, బస్టాపులు, ఆటోలపై వారి ప్రకటనలు ప్రదర్శిస్తున్నారు.
బెట్టింగ్‌లో గెలిస్తే రెట్టింపు డబ్బులు : బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలుస్తాయి.. ఎన్ని సీట్లతో సరిపెట్టుకుంటాయి.. అంటూ ఆన్‌లైన్ బెట్టింగ్ సంస్థలు ప్రకటనలు ప్రదర్శిస్తున్నాయి. డిసెంబరు 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయని.. పందెంలో గెలిచిన వారు అంతకంత డబ్బు సంపాదించుకోవచ్చని ఊరిస్తున్నాయి.
అధికార పక్షానికి దీటుగా విపక్షాలు - ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రచారాలు
అమాయకులను వలలో వేసుకునేందుకు జోరుగా ప్రచారం : ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిత్యం రకరకాల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే బెట్టింగ్ సంస్థలు అంతకు మించి హడావుడి పెంచాయి. అమాయకులను వలలో వేసుకునేందుకు రవాణా వాహనాలు, బస్టాపులు, రైల్వే స్టేషన్లు, ఇతరత్రా రద్దీ ప్రాంతాల్లోని టీకొట్లు, పాన్‌షాప్‌లు, దుకాణాల్లో గోడపత్రాలు అంటించి తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాయి. రాష్ట్ర ఓటర్లే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాయి. యువత, వ్యాపారులు, నిరుద్యోగులు, చిరుద్యోగులు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడే వారు ఎక్కువగా వాటికి ఆకర్షితులవుతున్నారు. తక్కువ సమయంలో, కష్టపడకుండా.. సులువుగా డబ్బు సంపాదించాలన్న కోరికతో ఉచ్చులో ఇరుక్కుంటున్నారు.
Political Parties Election Campaign in Telangana : మరోవైపు రాష్ట్ర ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచార పర్వంలో మునిగిపోయాయి. కాంగ్రెస్ పార్టీ తాము ప్రకటించిన ఆరు గ్యారంటీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళుతూ ప్రచార హోరు పెంచింది. పదేళ్ల సంక్షేమపాలనే ప్రధానాస్త్రంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే దూసుకెళుతుంది. బీజేపీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారాలతో పాటు సోషల్ మీడియాలోనూ బీఆర్ఎస్ వైఫల్యాలను బలంగా ఎత్తి చూపుతూ ఓట్లును అభ్యర్థిస్తున్నారు.
ప్రజల హక్కుల కోసం పోరాడే ఏకైక టీమ్ బీఆర్ఎస్ : కేటీఆర్
కాంగ్రెస్‌లో అసమ్మతి నాయకులకు కళ్లెం- ఒకట్రెండు మినహా అన్ని నియోజకవర్గాల్లో సర్దుబాట్లు