ETV Bharat / state

నందమూరి అభిమానులకు ముందే వచ్చిన సంక్రాంతి - Andhra Pradesh Main News

Veerasimha Reddy Pre Release Event: నందమూరి అభిమానులతో ఒంగోలు పట్టణం కళకళలాడుతోంది. సంక్రాంతికి విడుదల కానున్న నందమూరి నటకిషోరం బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఒంగోలులో నిర్వహించడం అభిమానులకు ముందే సంక్రాంతి పండుగ వచ్చినట్లయ్యింది.

Veerasimha Reddy Pre Release Event
Veerasimha Reddy Pre Release Event
author img

By

Published : Jan 6, 2023, 7:11 PM IST

నందమూరి అభిమానులకు ముందే వచ్చిన సంక్రాంతి

Veerasimha Reddy Pre Release Event: ప్రకాశం జిల్లాలో ఇంత పెద్ద ఈవెంట్‌ తొలిసారి నిర్వహించడంతో సినీ అభిమానుల్లో ఆనందోత్సహాలు వెల్లువెత్తుతున్నాయి. తొలుత ఏబీఎమ్ గ్రౌండ్​లో ఈ ఈవెంట్‌ నిర్వహించాలనుకున్నా, పోలీసులు అనుమతివ్వకపోవడంతో చివరి క్షణంలో ఒంగోలు పట్టణ శివారులో ఉన్న బీఎమ్ఆర్‌ లే ఆవుట్‌కు వేదిక మార్చారు. పోలీసులు అనేక ఆంక్షలు పెట్టి, చివరి క్షణంలో అనుమతి ఇవ్వడంతో శ్రేయాస్‌ మీడియా సంస్థ అతి తక్కువ సమయంలో ఏర్పాట్లు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, శృతిహాసన్‌తో పాటు, చిత్ర యూనిట్‌ అంతా పాల్గొననుంది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. చిత దర్శకుడు గోపీ చంద్‌ స్వగ్రామం ఒంగోలు కావడంతో ఈ ఈవెంట్​ను ఒంగోలులో ఏర్పాటు చేశారు. వేదిక వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అభిమానులు ఒక్కొక్కరుగా వచ్చి ఏర్పాట్లును వీక్షిస్తున్నారు. ప్రదాన రహదారికి ప్రక్కనే ఆవడం వల్ల ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు. భారీగా పోలీసులు కూడా బందోబస్తులో పాల్గొంటున్నారు.

ఒంగోలు చేరుకున్న బాలకృష్ణ: తెలంగాణలోని మొయినాబాద్‌ డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ నుంచి నందమూరి బాలకృష్ణ ప్రత్యేక హెలికాప్టర్‌లో ఒంగోలు చేరుకున్నారు. హెలికాప్టర్‌లో బాలకృష్ణతోపాటు హీరోయిన్ శృతిహాసన్, నిర్మాతలు నవీన్, రవిచంద్రలు ఉన్నారు. బాలకృష్ణ రాక కోసం ఎదురుచూస్తున్న అభిమానులతో ఒంగోలు కిక్కిరిసిపోయింది. కాసేపట్లో కార్యక్రమం జరుగనుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.