ETV Bharat / state

బాధితుల రక్తంలో ఆర్గానో క్లోరిన్‌, ఫాస్పరస్‌

author img

By

Published : Dec 12, 2020, 8:21 AM IST

ఏలూరును అంతుచిక్కని వ్యాధి కంగారు పెట్టిస్తోంది. కేసుల రాక మొదలై 6 రోజులు దాటినా మూలాలు తెలియకపోవడం వైద్య వర్గాలను విస్మయపరుస్తోంది . ఈ అంశంపై వైద్య పరిశోధనా సంస్థల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఏపీ ముఖ్యమంత్రి... నిశిత అధ్యయనం తర్వాతే వింత వ్యాధి మూలాలపై ఓ అవగాహనకు రావాలని స్పష్టం చేశారు.

ongoing-research-on-eluru-strange-disease
బాధితుల రక్తంలో ఆర్గానో క్లోరిన్‌, ఫాస్పరస్‌

ఏపీలో ఏలూరు వింత వ్యాధిపై జాతీయ స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నా... నిర్దిష్టమైన కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. బాధితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షించేలోగా... అందులో టాక్సిక్ ప్రభావం తగ్గి ఉంటుందని సీనియర్ వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కేసులు తగ్గుతుండడం మంచి పరిణామమే అయినా... కారణాలు తెలియకపోవడం మాత్రం ఆందోళనకు గురిచేస్తోందని అంటున్నారు. శుక్రవారం నాటికి 610 కేసులు రికార్డైనట్లు చెప్పిన ఏపీ అధికారులు... మూర్ఛ వల్ల రోగులు కాళ్లు , చేతులు తీవ్రంగా కొట్టుకుంటున్నారని తెలిపారు..

16న పూర్తి నివేదిక..!

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, దిల్లీ ఎయిమ్స్ , ఎన్​ఐఎన్ సంస్థలు ఇచ్చిన నివేదికలో రోగుల రక్త నమూనాల్లో సీసం, నికెల్ లాంటి భార లోహాలు ఉన్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. రక్త నమూనాల్లో ఆర్గానో ఫాస్పెట్స్ ఉన్నట్టు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పేర్కొంది. దీనిపై మరింత లోతైన విశ్లేషణ అవసరమని ఆ సంస్థ అభిప్రాయం వ్యక్తం చేసింది. రోగుల రక్తంలో ఆర్గానో ఫాస్పెట్స్, ఆర్గానో క్లోరిన్ లాంటి పదార్థాలు ఉండటంపై ఎయిమ్స్ సంస్థ మరింత పరిశోధన చేస్తున్నట్లు తెలిపింది. దిల్లీకి పంపిన 40 యూరిన్ నమునాల్లో రెండింటిలో మాత్రమే నికెల్, సీసం ఆనవాళ్లు గుర్తించిన్నట్లు అధికారులు తెలిపారు.

ఎయిమ్స్‌తో పాటు... ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ పరిశోధనలో... నీటి నమునాల్లో ఎలాంటి లోపాలు లేవని తెలిసింది. నీటి నమూనాల పూర్తి విశ్లేషణకు ఈ నెల 14 వరకు సమయం పడుతుందని ఎన్​ఐఎన్ వెల్లడించింది. ఏలూరు నగరపాలక సంస్థ సరఫరా చేస్తున్న తాగునీరు సురక్షితంగా నే ఉందని... ప్రజలు నిరభ్యంతరంగా వీటిని వినియోగించవచ్చని తెలిపారు. కూరగాయల నమునాల్లో కలుపు మొక్కల నివారణకు వినియోగించే మందుల అవశేషాలను ఎన్​ఐఎన్ కనుగొంది. బియ్యం, మాంసం, చేపలు, మట్టి తదితర నమూనాలకు సంబంధించిన ఫలితాలు వెల్లడి కావాల్సి ఉందని ఏపీ వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. ఫలితాలు 16 వ తేదీ నాటికి వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

ఎలా కలిశాయో తెలుసుకోవాలి

అంతుచిక్కని వ్యాధి బాధితుల రక్తనమూనాల్లో సీసం, ఆర్గానో క్లోరిన్‌, ఆర్గానో ఫాస్పరస్‌ ఉన్నట్లు పరిశోధనా సంస్థల నివేదికల ద్వారా తెలుస్తోందన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్... ఇవి బాధితుల రక్తంలో ఎలా కలిశాయో కనుగొనాలని వైద్య పరిశోధనా సంస్థలను కోరారు. పశ్చిమగోదావరి జిల్లా అధికారులు, వైద్య పరిశోధనా సంస్థల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన... తాగునీటి నమూనాలను ఒకటికి రెండుసార్లు పరీక్షించాలని ఆదేశించారు. నిశిత అధ్యయనం తర్వాతే అంతు చిక్కని వ్యాధి మూలాలపై ఓ అవగాహనకు రావాలన్నారు.

ఏ అంశాన్నీ కొట్టిపారేయొద్దన్న జగన్​.... నిపుణులు అనుమానం వ్యక్తం చేసిన ప్రతి కోణంలోనూ మరింత పరిశోధన చేయాలన్నారు. పురుగుమందుల వినియోగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సేంద్రీయ ఉత్పత్తులను ప్రోత్సహించేలా ముందుకు సాగాలని సూచించారు. నిషేధిత రసాయనాలు, పురుగుమందులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించాలని నిర్దేశించారు. సమావేశంలో కేంద్ర వైద్య సాంకేతిక పరిశోధనా సంస్థల నిపుణులు తమ అభిప్రాయాలను తెలిపారు. ఈ నెల 16న మరోమారు వారితో సమావేశం నిర్వహించాలని ఏపీ సీఎం నిర్ణయించారు.

ఇదీ చదవండి: పనిభారం తట్టుకోలేక ఉపాధ్యాయుడు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.