ETV Bharat / state

ఒకే రోజు.. ఒక్క గంటలో కోటి మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు

ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఒక్క గంటలో కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను సంతోష్‌కుమార్‌తో కలిసి ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో విడుదల చేశారు.

one crore plants will plant in one day in one hour occasion of cm kcr birthday
ఒకే రోజు.. ఒక్క గంటలో కోటి మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు
author img

By

Published : Feb 7, 2021, 2:29 PM IST

హరిత తెలంగాణను స్వప్నిస్తున్న సీఎం కేసీఆర్ సంకల్పానికి మద్దతుగా ఒకే రోజు కోటి మొక్కలు నాటే కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టారు. ఈనెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఒక్క గంటలో కోటి మొక్కలు నాటనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను సంతోష్‌కుమార్‌తో కలిసి ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో విడుదల చేశారు.

తెలంగాణలో పచ్చదనాన్ని మరింతగా పెంచాలానే సీఎం కేసీఆర్ ఆశయాలను అనుగుణంగా, ప్రతీ తెలంగాణ జాగృతి కార్యకర్త మొక్కలు నాటాలని కవిత కోరారు. తను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవటమే సీఎం కేసీఆర్​కు మనం ఇచ్చే పుట్టిన రోజు కానుక అన్నారు.

కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్​ను కవిత అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, కిషోర్, తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షులు మేడే రాజీవ్ సాగర్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పార్టీలో చిన్న చిన్న మనస్పర్థలు సహజం: ఉత్తమ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.