ETV Bharat / state

ఓయూ విద్యార్థినుల వసతి గృహంలో చోరికీ పాల్పడిన వ్యక్తి అరెస్ట్​

ఓయూ విద్యార్థినుల వసతి గృహంలో చోరికీ పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నట్లు సీపీ అంజనీకుమార్​ తెలిపారు.

ఓయూ విద్యార్థినుల హాస్టల్​లో చోరీ కేసులో ఒకరు అరెస్ట్​
author img

By

Published : Aug 23, 2019, 11:00 PM IST

ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థినుల వసతి గృహంలో చొరబడిన యువకుడిని అరెస్ట్​ చేసినట్లు సీపీ అంజనీకుమార్​ వెల్లడించారు. మరొకరి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 15న బీఎన్‌రెడ్డినగర్‌కు చెందిన పోటెల రమేష్‌, కాచిగూడకు చెందిన సన్నితో కలిసి విద్యార్థినుల వసతి గృహంలోకి చొరబడ్డారు. రమేష్‌ కత్తితో విద్యార్థినిని బెదిరించి చరవాణి అపహరించాడు. బాధితురాలు కేకలు వేయడం వల్ల రమేష్‌, సన్ని ఇద్దరు అక్కడ నుంచి పరారయ్యారని సీపీ తెలిపారు. వీరిపై గతంలో కేసులు ఉన్నట్లు అంజనీకుమార్​ పేర్కొన్నారు. మూడు చరవాణులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఓయూ విద్యార్థినుల వసతి గృహంలో చోరికీ పాల్పడిన వ్యక్తి అరెస్ట్​

ఇవీ చూడండి: 'ఇదేం భద్రత ?? ఇకనైనా గస్తీ పెంచండి'

TG_HYD_76_23_OU_LADIES_HOSTEL_INCIDENT_ONE_ARREST_AB_3066407 REPORTER:K.SRINIVAS ( )ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్ధినుల వసతి గృహంలో చొరబడిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. బిఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన పోటెల రమేష్‌, కాచిగూడ నివాసి సన్ని కలిసి వసతి గృహంలోకి చొరబడ్డారు. రమేష్‌ కత్తితో విద్యార్ధినిని బెదిరించి చరవాణి అపహరించాడు. బాధితురాలు కేకలు వేయగా రమేష్‌, సన్ని ఇద్దరు అక్కడ నుంచి పరారయ్యారని పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. అయితే వీరిద్దరూ పాత నేరస్తులుగా పోలీసులు గుర్తించారు. గతంలో రమేష్‌ ఎక్సైజ్‌ కేసులో పీడీ చట్టం కింద జైలు శిక్ష అనుభవించినట్టు ఆయన చెప్పారు. పరారీలో ఉన్న రమేష్‌ కోసం గాలిస్తున్నట్టు ఆయన తెలిపారు. పట్టుబడిన నిందితుడి వద్ద నుంచి మూడు చరవాణులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బైట్‌:అంజనీకుమార్‌, పోలీసు కమిషనర్‌
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.