వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విద్యార్థులకు సూచించారు. జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ ఉన్నతపాఠశాలలో నులిపురుగుల పై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. దాని వల్ల వచ్చే వ్యాధులు, వాటి నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. చిన్ననాటి నుంచే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పిల్లలకు సూచించారు.
విద్యార్థులకు చదువుతోపాటు ఆటలు కూడా చాలా అవసరమన్నారు. విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం రూ. లక్షా 50వేలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆలపించిన పాటలు గవర్నర్ని ఆకట్టుకున్నాయి.
ఇదీ చూడండి: 'మమ్మల్ని కాపాడండి'.. మోదీకి భారతీయుల విజ్ఞప్తి