ఓబులాపురం కంపెనీ అక్రమ మైనింగ్ కేసుపై ఇవాళ హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డితో పాటు బీవీ శ్రీనివాస్ రెడ్డి, అలీఖాన్ హాజరయ్యారు. న్యాయవాదులు వాదనలు వినిపించారు. తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ శ్రీలక్ష్మి కోర్టు అనుమతితో గైర్హాజరయ్యారు.
ఈ కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తైన తర్వాతే.. అభియోగాల నమోదు ప్రక్రియ చేపట్టాలని నిందితులు కోర్టును కోరారు. సరిహద్దు వివాదం మినహా దర్యాప్తు పూర్తయిందని ఇప్పటికే కోర్టుకు సీబీఐ తెలిపింది. దానిపై వాదనలు వినిపించేందుకు నిందితుల తరఫు న్యాయవాదులు సమయం కోరారు. పరిశీలించిన సీబీఐ కోర్టు తదుపరి విచారణను ఈనెల 17కి వాయిదా వేసింది.
ఇవీ చూడండి:21వేల మంది పోలీసులతో నిమజ్జనానికి భద్రత