Officials Seize Henna Made with Dangerous Chemicals : మీ వెంట్రుకలు నిగనిగలాడాలని హెన్నా(Henna) వాడుతున్నారా.? చేతులు మరింత అందంగా కనిపించాలని హెన్నాతో డిజైన్లు వేసుకుంటున్నారా.? అయితే ఈసారీ వేసుకునేముందు సరైందా కాదా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి సుమీ. ఎందుకంటే వాటిని ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. మీ ముస్తాబు సంగతి దేవుడెరుగు! ఆరోగ్యసంబంధ సమస్యలు తప్పవని బ్యూటీషియన్లు హెచ్చరిస్తున్నారు.
యాంటీ క్యాన్సర్ డ్రగ్స్‌పై డీసీఏ ఉక్కుపాదం - భారీ మొత్తంలో నకిలీ మందులు స్వాధీనం
Henna Seize in Mehedipatnam : ధనార్జనే ధ్యేయంగా కల్తీరాయుళ్లు రెచ్చిపోతున్నారు. పసిపిల్లల పాల పొడి నుంచి పండు ముసలి మందుగోళీల వరకు దేనిని వదలడం లేదు. తలకు పెట్టుకునేందుకు స్త్రీలు, పురుషులు వాడే హెన్నాను డేంజరస్ రసాయనాలతో తయారు చేస్తూ పట్టుబడిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. మెహిదీపట్నంలోని ఓ యూనిట్‌ను తెలంగాణ ఔషధ నియంత్రణ విభాగం అధికారులు మంగళవారం సీజ్ చేశారు.
సదరు ప్రాంతంలో పెద్దఎత్తున హెన్నా ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా పిక్రామిక్ యాసిడ్ అనే విషపూరిత రసాయనాన్ని ఉపయోగించి హెన్నా తయారు చేస్తున్నట్లు గుర్తించినట్లు డ్రగ్ కంట్రోల్ విభాగం డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. మెహిదీపట్నంలోని షకిల్ ఇండస్ట్రీస్ పేరుతో ఈ హెన్నాను తయారు చేసి ‘స్పెషల్ కరాచీ మెహందీ కోన్ అనే’ పేరుతో విక్రయిస్తున్నారు.
నకిలీ టీవీలు విక్రయిస్తున్న ముఠా అరెస్టు - సోనీ టెలివిజన్ పేరుతో భారీ మోసం
పిక్రామిక్ యాసిడ్ అనే సింథటిక్ డై వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. జుత్తు అందం దెబ్బతింటుందని, ఈ ఉత్పత్తికి బీఎస్‌ఐ గుర్తింపూ లేదని స్పష్టం చేశారు. హనుమకొండలో విక్రయిస్తున్న ఈ నకిలీ హెన్నాను గుర్తించి అక్కడ అధికారులు తీగలాగితే చివరికి మెహిదీపట్నంలో డొంక కదిలింది. ఈ నకిలీ హెన్నా ఉత్పత్తి వెనుక అసలు గుట్టు రట్టు అయింది.
షకీల్ ఇండస్ట్రీస్‌కు చెందిన మహ్మద్ యూసుఫ్ అలీ దీనికి ప్రధాన కారకుడిగా గుర్తించి అతని నుంచి భారీ హెన్నా స్టాకును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శాంపిళ్లను సేకరించి లాబ్‌కు పంపినట్లు వి.బి.కమలాసన్‌రెడ్డి తెలిపారు. విచారణ తర్వాత నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడిలో డ్రగ్ కంట్రోల్ అధికారులు జె.కిరణ్‌కుమార్, పి.సంతోష్, సి.వివేకానందరెడ్డి, వి.అజయ్ తదదితరులు పాల్గొన్నారు. బీఎస్‌ఐ గుర్తింపు లేని ఇలాంటి సౌందర్య ఉత్పత్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Fake Iphone Accessories in Hyderabad : హైదరాబాద్‌లో ఐఫోన్ విడిభాగాలు కొంటున్నారా.. అయితే జాగ్రత్త...