మారుతున్న వాతావరణ పరిస్థితులు, పరిసరాల అపరిశుభ్రతతో రోజు రోజుకు డెంగీ బాధితులు పెరుగుతున్నారు. మారేడ్ పల్లి పీఎస్ పరిధిలో బృందా అనే బాలిక డెంగీ బారిన పడి ఆసుపత్రి పాలైంది. కొన్ని రోజులుగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న బృందా ఉదయం మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆరో తరగతి చదువుతున్న బృందా మరణంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు విషాదంలో కురుకుపోయారు.
కంటోన్మెంట్ ప్రాంతంలోని అధికారుల నిర్లక్ష్యం, దోమల మందు పిచికారి లేమి, పరిశుభ్రత పాటించకపోవడం తదితర కారణాల వల్ల డెంగీ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత వల్లే అనేక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. దోమలు వ్యాప్తి చెందకుండా ఇప్పటికైనా గట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చూడండి : ప్రతి రాత్రి వారి నిద్ర శ్మశానంలోనే.. ఎందుకంటే..?