హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలపై జలమండలి కార్యాలయంలో నగర సమన్వయ సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు సజ్జనార్, మహేష్ భగవత్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తోపాటు పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన అగ్నిప్రమాదంపై చర్చించారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి శుక్రవారం జోనల్ కమిషనర్లు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. మార్కెట్లు, ఎగ్జిబిషన్లను పూర్తిగా పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇవ్వాలన్నారు.
రానున్న వర్షాకాలంలో నగర వాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డ్రైనేజీ, మ్యాన్‌హోల్స్ విషయంలో ప్రణాళికబద్ధమైన చర్యలు చేపటనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు.
ప్రమాదం వచ్చినప్పుడు కాకుండా ముందు నుంచే అప్రమత్తంగా ఉండాలని అధికారులకు దాన కిషోర్ సూచించారు.
అధికారులకు 'అగ్ని' - FIRE SAFTY
యాజమాన్యాల అలసత్వమో... అధికారుల నిర్లక్ష్యమో... నగరంలో వరుసగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభంలేదని భావించిన అధికారులు.... ముందు జాగ్రత్త చర్యలపై దృష్టిపెట్టారు.