ETV Bharat / state

Posting In GHMC: ఖర్చు ఎంతైనా.. బల్దియా కుర్చీయే కావాలె! - అక్రమంగా సొమ్ము సంపాదించడం

జీహెచ్‌ఎంసీకి డిప్యుటేషన్ల తాకిడి పెరిగింది. ఆ శాఖలో పోస్టింగ్‌ (Posting In GHMC) బంగారు బాతుగుడ్డులా మారింది. అందులో కుర్చీ దక్కించుకునేందుకు వేర్వేరు శాఖల ఉద్యోగులు ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనుకాడడంలేదు. డిప్యుటేషన్‌పై వస్తున్న కొందరు ఉద్యోగపరమైన అవసరాల కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. మరికొందరు అక్రమ సంపాదనే ధ్యేయంగా పోస్టింగ్‌ (Posting In GHMC)కు యత్నిస్తున్నారు.

Posting In GHMC
జీహెచ్​ఎంసీలో పోస్టింగ్
author img

By

Published : Nov 13, 2021, 1:56 PM IST

జీహెచ్‌ఎంసీలో పోస్టింగ్‌ (Posting In GHMC) బంగారు బాతుగుడ్డులా మారింది. డిప్యుటేషన్‌పై వస్తున్న కొందరు ఉద్యోగపరమైన అవసరాల కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. మరికొందరు అక్రమ సంపాదనే ధ్యేయంగా పోస్టింగ్‌ (Posting In GHMC)కు యత్నిస్తున్నారు.

ఇవే నిదర్శనాలు

  • జీహెచ్‌ఎంసీలోని 30 సర్కిళ్లకు 26 మంది సహాయ వైద్యాధికారులుండగా ఆరుగురు ఐదేళ్లకు పూర్వం నుంచి కొనసాగుతున్నారు. వైద్యాధికారులు వైద్య ఆరోగ్య శాఖ నుంచి బల్దియాకు డిప్యుటేషన్‌ (Posting In GHMC)పై వస్తారు. బల్దియాలో కుర్చీ కోసం.. కొందరు వైద్య ఆరోగ్య శాఖలోని ఉన్నతాధికారికి రూ.5 లక్షలు లంచంగా ఇచ్చి వస్తున్నారన్న విమర్శలున్నాయి.
  • డిప్యుటేషన్‌ నిబంధనల ప్రకారం.. ఏదైనా శాఖకు వెళ్తే.. మూడేళ్లకు తిరిగి మాతృశాఖకు రావాలి. లేదా, ప్రత్యేక అనుమతితో రెండేళ్లు ఏడాదికోసారి అనుమతి తీసుకుని కొనసాగొచ్చు. అలా బల్దియా (Posting In GHMC)కు వస్తున్న వారు.. ఏళ్ల తరబడి తిష్ఠవేస్తున్నారు.
  • పారిశుద్ధ్య కార్మికులు మరణిస్తే.. వారి రక్తసంబంధీకులకు ఆ కొలువు ఇవ్వాలనేది నిబంధన. అందుకు జోనల్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో కమిటీ ఉంటుంది. కమిటీ కళ్లుగప్పిన పాతబస్తీలోని ఓ వైద్యాధికారి.. మరణించిన కుటుంబానికి కాకుండా.. మరో కార్మికుడి కుమారుడికి ఉద్యోగం వచ్చేలా చేశారు. అందుకు రూ.2 లక్షలు లంచం తీసుకున్నట్లు విమర్శలున్నాయి.
  • యూసీడీ(అర్బన్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌) విభాగంలో ప్రాజెక్టు డైరెక్టర్‌గా పనిచేస్తున్న పంచాయతీరాజ్‌ శాఖకు చెందిన అధికారిణి.. ఉన్నతస్థాయి పలుకుబడితో డిప్యుటేషన్‌ (Posting In GHMC) ముగిసినా కొనసాగుతున్నారు. యూసీడీలో ప్రాజెక్టు డైరెక్టర్‌ అనే పోస్టును సృష్టించి ఆమెకు ఇచ్చారని, ఆమె కిందిస్థాయి ఉద్యోగులపై వేధింపులకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులున్నప్పటికీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవట్లేదన్న విమర్శలున్నాయి.
  • విద్యుత్తుశాఖ ఇంజినీర్లు కొందరు బల్దియా ఐటీ (Posting In GHMC) విభాగంలో పనిచేసేందుకు పోటీ పడుతున్నారు. అవసరం లేకపోయినా.. స్వచ్ఛ భారత్‌, పారిశుద్ధ్యం, ఇతరత్రా అవసరాలకు ఐటీ విభాగంలోని కొందరు ఇంజినీర్లు మొబైల్‌ యాప్‌లను ప్రైవేటు ఏజెన్సీలతో తయారు చేయించి, బల్దియా ఖజానాకు నష్టం చేస్తున్నారు.
  • శేరిలింగంపల్లి జోన్‌లోని ఓ వైద్యాధికారి, ఇంజినీరింగ్‌ ఉన్నతాధికారి కొవిడ్‌ మరణాల మాటున భారీగా నిధులు పక్కదారి పట్టించారు. మృతదేహాల తరలింపు, శ్మశాన వాటికల నిర్వహణల్లో అవకతవకలకు పాల్పడ్డారు.

ఇదీ చూడండి: Honey trap to software engineer : 'పెళ్లి చేసుకుందామని.. రూ.95 లక్షలు కాజేసింది'

GHMC funds news: బల్దియా నిధులకు రాష్ట్రం ఎగనామం

Hyderabad Traffic: రహదారులపై ఆక్రమణలు.. తూతూమంత్రంగా చర్యలు

GHMC Swachh autos: గ్రేటర్​లో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణకు.. మరో 1,350 స్వచ్ఛ ఆటోలు.!

సకాలంలో ఆస్తిపన్ను చెల్లించకపోతే ప్రతి నెలా 2 శాతం పెనాల్టీ: జీహెచ్​ఎంసీ

Congress letter to GHMC: 'ఫ్లెక్సీలకు అనుమతి ఉందా.. ఎంత వసూలు చేసారో చెప్పండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.